ఒప్పందంతో తగ్గిన వడ్డీ రేట్లు
మహిళా సంఘాలకు రూ.5 లక్షల పైన రూ.20 లక్షల వరకు 9.70% కే రుణాలు
రాష్ట్రంలోని పొదుపు సంఘాలలో 10% సంఘాలు కెనర బ్యాంకు నుంచే
త్వరలో మరొక పెద్ద బ్యాంకు కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం
విజయవాడ : పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా, వారు
ఏర్పాటుచేసుకొనే చిన్న , మధ్య తరహా వ్యాపారాలు, పరిశ్రమలకు వ్యక్తిగతంగా
రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి కెనర బ్యాంకు సెర్ప్, సీఈఓ తో బుధవారం
మరొక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై
వడ్డీ రేట్లు తగ్గించేందుకు మరొక బ్యాంకు అయిన కెనర బ్యాంకు ముందుకు వచ్చింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ
రేట్లు తగ్గిస్తూ కెనర బ్యాంకు సెర్ప్ సీఈఓ ఏ.యండి.ఇంతియాజ్, కెనర బ్యాంకు
ఆంధ్రప్రదేశ్ హెడ్, జనరల్ మేనేజర్ పి.రవివర్మ అవగాహనా ఒప్పందం
కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమం లో సెర్ప్ బ్యాంకు లింకేజీ డిప్యూటీ జనరల్
మేనేజర్ యం.కేశవకుమార్ , విజయవాడ కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్
ఐ.సత్యనారాయణ హాజరయ్యారు. వడ్డీరేట్ల తగ్గింపుతో పాటు ఆయా రుణాలపై ఎలాంటి
అదనపు, ప్రాసెసింగ్ , ఇన్స్పెక్షన్ అన్యువల్ రివ్యూ లేదా రెన్యువల్ చార్జీలను
పూర్తిగా మినహాయించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాంకులు రూ.5 లక్షల పైన
మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలలో తక్కవ వడ్డీ రేట్లలో ఉన్న బ్యాంకు లు అప్కాబ్
– 9% , కెనర బ్యాంకు 9.70% , స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 9.70%. మహిళా సంఘాలలో
ఆర్థిక అక్షరాస్యత పై ట్రైనింగ్ లతో అవగాహానా పెరిగి , మహిళా సంఘాలు తక్కువ
వడ్డీ రేట్లుకు రుణాలు ఇస్తున్న బ్యాంకు ల వైపు మొగ్గు చూపుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు, సెర్ప్ సీఈఓ, ఏ.యండి.ఇంతియాజ్
చొరవతో త్వరలో మరిన్ని బ్యాంకు లు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది.