ఆందోళన కలిగించే స్థాయిలో సైబర్ నేరాలు
గ్యాస్ ధర తగ్గింపును స్వాగతిస్తున్న వైఎస్సార్సీపీ
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
గుంటూరు : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే 50
లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్ల రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బుధవారం పలు అంశాలపై
స్పందించారు. ఈ మేరకు అనతికాలంలోనే గొప్ప లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్ర గృహ
నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మరోవైపు పేదల ఇళ్ల నిర్మాణం
ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన టీడీపీకి అతి కొద్ది
సమయంలోనే సాధించిన ఈ పురోగతి పెద్ద గుణపాఠం అవుతుందని అన్నారు.
*జగన్ పాలనలో 2.07లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు : జగన్మోహన్ రెడ్డి పాలనలో
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 2.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, నెలకు
రూ. 3,300 కోట్లు జీతాల కోసం ఖర్చు చేస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం
34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, జీతాల కోసం నెలకు రూ. 1,100 కోట్లు
మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు.
గ్యాస్ ధర తగ్గింపును స్వాగతిస్తున్న వైఎస్సార్సీపీ : డొమెస్టిక్ గ్యాస్
సిలిండర్ ధర రూ.200 తగ్గిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం
మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున ఊరట కలిగిస్తుందని పేదల సంక్షేమం కోరుతూ
తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ స్వాగతిస్తోందిని అన్నారు. సిలిండర్ ధర
తగ్గడం ద్వారా మిగిలిన ఆ ధనం వేరే అవసరాలకు వినియోగపడుతుందని అన్నారు.
ఆందోళన కలిగించే స్థాయిలో సైబర్ నేరాలు : దేశంలో సైబర్ నేరాలు ఆందోళన కలిగించే
స్థాయిలో పెరుగుతున్నాయని ప్రజలు పెద్ద ఎత్తున సైబర్ మోసాలకు గురవుతున్నారని
అన్నారు. మోసాలకు గురై కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకుంటున్నారని
అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలతో కలిసి సైబర్
నేరగాళ్లను పట్టుకొని జైల్లో పెట్టాలని అన్నారు. అన్ని సెక్యూరిటీ,
ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీలూ కలిసి పనిచేయడం ద్వారా మాత్రమే సైబర్ నేరాలను
అరికట్టవచ్చని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సైబర్ నేరాలు షాక్ కు గురి
చేస్తున్నాయని గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం సైబర్ నేరాలు పిర్యాదులు
200% పైబడి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయనన్నారు. 2022 జనవరి 1 నుంచి
జూన్ 30 వరకు ఢిల్లీ పోలీసులు 7500 సైబర్ నేరాల పిర్యాదులు అందుకుంటే అదే ఆరు
నెలల కాలానికి ఈ సంవత్సరం ఏకంగా 24000 పిర్యాదులు అందుకున్నారని చెప్పారు.
అలాగే సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న సొమ్ము కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ
సంవత్సరం భారీగా పెరిగిందని విజయసాయి రెడ్డి అన్నారు.