ధర్నా చౌక్ లో ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ టీచర్స్ ఆఫీసర్స్ జాక్ ఆధ్వర్యంలో
చలో విజయవాడ
విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లను రద్దు చేస్తే
సహించేది లేదని ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ జేఏసీ కో కన్వీనర్ జగదీష్
హెచ్చరించారు. బుధవారం స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో ఏపీ ఎస్సీ ఎస్టీ
ఎంప్లాయిస్ టీచర్స్ ఆఫీసర్స్ జాక్ ఆధ్వర్యంలో చలో విజయవాడ మహాసభ మహా ధర్నా
సందర్భంగా చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ
ఉద్యోగులను అణిచి వేయాలని చూస్తుందని ఛలో విజయవాడ కార్యక్రమానికి అన్ని రకాల
పర్మిషన్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల
నిర్బంధాలను విధిస్తుందని మహాసభ ను నిర్వీర్యం చేసే క్రమంలో ఉద్యోగులను
అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్లలో
రిజర్వేషన్లు రద్దు చేయడమంటే ఎస్సీ ఎస్టీల అభ్యున్నతిని అడ్డుకోవటమేనని
అన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేసినందుకే ఇంటికి పంపించామని ఏ
ప్రభుత్వం కూడా అలానే చేస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తే 2024 లో తగిన
బుద్ది చెపుతామన్నారు.
అనంతరం గౌరవాధ్యక్షులు పట్టపు శీనయ్య మాట్లాడుతూ ప్రమోషన్ లలో రిజర్వేషన్
కల్పిస్తూ కాన్ సెక్వాన్షేనల్ సీనియారిటి కి సంబందించి జి.వో.ఎం.ఎస్.నం. 20
ఉన్నప్పటికీ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్నేషన్ ఎలాగైనా
తీసివేయాలనే ఆలోచనతో కమిటీని వేసి వారి రిపోర్ట్ ద్వారా క్యాచ్ అప్ రూల్ ను
ప్రవేశపెట్టి దాదాపు 2 లక్షల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రివర్షన్ ఇచ్చి ఏకంగా
ప్రమోషన్ లలో రిజర్వేషన్ ను ఎత్తివేసే ప్రక్రియను చేపట్టడంతో ఎస్సీ,ఎస్టీ
ఉద్యోగులు పోరుబాట పట్టారన్నారు. ఈ ప్రభుత్వం ధర్నాకు పిలుపునిస్తే కనీసం
చర్చలు జరపకుండా జిల్లాల వారీగా ఉద్యోగులను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం
చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సి ఎస్టి ఎంప్లాయిస్ టీచర్స్ ఆఫీసర్స్
జాక్ గౌరవ అధ్యక్షులు పట్టపు సీనయ్య, నిర్మల జ్యోతి జేఏసీ కో కన్వీనర్,
ప్రసాద్ రావు జాక్ కో కన్వీనర్, దళిత నాయకుడు బేతాళ సుదర్శన్ , మోహన్ ధర్మా
తదితరులు పాల్గొన్నారు.