ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పాలకొండ నియోజకవర్గం నుంచి తలే భద్రయ్య టీడీపీలో రెండు సార్లు గెలుపొందారు.
(1985, 1994), ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఆరేళ్ళ పాటు భద్రయ్య పనిచేశారు. ఈ
కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ
సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
(చిన్న శ్రీను), రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.
వైసీపీ లోకి అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్ కుమార్ : అనకాపల్లి టీడీపీ నేత
మలశాల భరత్ కుమార్, తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్), ధనమ్మ
(మాజీ ఎంపీపీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్‌తో పాటు గంగుపాం
నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్), మలశాల కుమార్ రాజా (విశాఖ జిల్లా
తెలుగుయువత ప్రధాన కార్యదర్శి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్
కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్,
అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.
సీఎం వైఎస్ జగన్ కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటన : కాకినాడ జిల్లా
జగ్గంపేటలో బుధవారం సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే
జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. ఉదయం 10
గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగ్గంపేట మండలం ఇర్రిపాక చేరుకుంటారు.
అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో ఆయన కుమార్తె వివాహ
వేడుకకు హాజరుకానున్న సీఎం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.