విజయవాడ : ప్రతిష్టాత్మక సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ అంతర్జాతీయ
మధ్యవర్తి ప్యానెల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
నియమితులయ్యారు. జస్టిస్ రమణకు సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్
చైర్మన్ జార్జ్ లిమ్ సింగపూర్లో మంగళవారం నియామక పత్రాన్ని అందించారు.
సింగపూర్ న్యాయ మంత్రిత్వ శాఖ, 20కి పైగా భాగస్వామ్య సంస్థలు నిర్వహించే
“సింగపూర్ కన్వెన్షన్ వీక్” వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు జస్టిస్ రమణ
ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. జస్టిస్ రమణ సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్
సెంటర్ నాలుగు ప్రముఖ భారతీయ ఎంఎన్ సిల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జస్టిస్
రమణ చొరవతో మధ్యవర్తిత్వానికి మద్దతు ఇవ్వడానికి నాలుగు భారతీయ కార్పొరేట్
సంస్థలు టాటా, రిలయన్స్, మహీంద్రా, ఆదిత్య బిర్లా గ్రూపులు ‘డిక్లరేషన్ ఆఫ్
ఇంటెంట్’పై సంతకం చేయడానికి ముందుకు వచ్చాయి.