మచిలీపట్నం : కృష్ణాజిల్లాలో జి ఈ ఆర్ సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్
పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో
ఎంఈఓ లతో సమావేశం నిర్వహించి జిల్లాలో వాలంటీర్ ఎడ్యుకేషన్ సర్వే, నూరు శాతం
జి ఈ ఆర్ సాధనలో సమస్యల ఎంఈఓ లతో సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలో గల 508
సచివాలయాల పరిధిలో చేపట్టిన వాలంటీర్ ఎడ్యుకేషన్ సర్వే 98 శాతం
పూర్తయిందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహించిన హౌస్ హోల్డ్
సర్వేలో 5-18 సం మధ్య వయసు గల 2.01లక్షల మంది విద్యార్థులను గుర్తించినట్లు
తెలిపారు. ఈ డేటా స్కూలు/ కాలేజీ/ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ డేటాతో
అనుసంధానించినట్లు తెలిపారు. తద్వారా గుర్తించిన డ్రాపవుట్స్ ను గుర్తించి
తిరిగి పాఠశాలల్లో/ కళాశాలలో చేర్పించడం ద్వారా జిల్లాలో నూరు శాతం జీ ఈ ఆర్
సాధనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం
అన్నారు. నూరు శాతం జీ ఈ ఆర్ సాధనలో జిల్లా కలెక్టర్ నుండి వాలంటీర్ స్థాయి
వరకు భాగస్వామ్యం కావాలన్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఎంఈఓ లు,
ఎంపీడీవోలు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వాలంటీర్లు తమ తమ పరిధిలో నూరు
శాతం జీఈ ఆర్ సాధనకు కృషి చేయాలన్నారు.
ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలి. 15 సంవత్సరాలు దాటిన వారిని ఓపెన్
స్కూల్లో చేర్చాలి ఇదే మన లక్ష్యం కావాలన్నారు. నేటికీ జిల్లాలో 966 సిస్టం
డ్రాప్ అవుట్స్, 1862 స్కూల్ డ్రాప్ అవుట్స్ గా ఉన్నారని అన్నారు. ప్రతి
మండలంలో సచివాలయ/వాలంటీర్ క్లస్టర్ పరిధిలో డ్రాపవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏం
చదువుతున్నారు ఈ సర్వేలో సమస్యలు ఎంఈఓ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వేద
పాఠశాలలకు యుడైస్ కోడ్ లేవని ఘంటసాల ఎంఈఓ తెలుపగా, విద్యాశాఖ ఉన్నతాధికారులకు
నివేదించాలని డిఈఓ కు సూచించారు. ఇంకా గుర్తించబడని వారి విషయంలో అవసరమైతే మరల
రీసర్వ్ చేయాలని వారు ఎక్కడ ఉన్నారు, ఏం చదువుతున్నారు గుర్తించాలన్నారు. తరచు
టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తామన్నారు ప్రభుత్వం విద్య రంగానికి
అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. నాడు- నేడు ,అమ్మబడి వంటి ఎన్నో కార్యక్రమాలు
అమలు చేస్తుందన్నారు. విద్య లేకపోతే ఎందుకు పనికిరారు. కావున ప్రతి ఒక్కరూ
పాఠశాలలో ఉండాలి. నూరు శాతం నమోదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
భావిస్తోందన్నారు. విద్యాశాఖ అధికారులుగా మీ వంతు కృషి చేయాలన్నారు. ఈ
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డీఈవో తహెరా సుల్తానా, డి
ఎల్ డి వో సుబ్బారావు, జడ్పీ సీఈవో జ్యోతి బసు, డిస్ట్రిక్ట్ ఒకేషనల్ విద్యాశా
ఖాదికారి ప్రసాద్, వివిధ మండలాల ఎంఈఓ లు పాల్గొన్నారు.