మచిలీపట్నం : కుల మత ప్రాంత పార్టీలకతీతంగా అందరికీ అన్ని విధాలా మేలు
చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
మంత్రి జోగి రమేష్ ప్రజలను కోరారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలం,
చినగొల్లపాలెం-2 సచివాలయం పరిధిలోని నల్లగంగుల వారి పేటలో గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ
పథకాలను వివరించడంతో పాటు లబ్ధిదారులు ఇప్పటివరకు పొందిన లబ్ధిని ఇంటింటిని
సందర్శించి వారికి తెలియ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో అర్హులైన ప్రతి ఒక్కరికీ
సంక్షేమ ఫలాలను అందిస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారని చెప్పారు. ఆయా పథకాలు
లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా
ఆరా తీసి అర్హత ఉండి అందుకోలేని వారికి మరల అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు.
అర్హులై ఉండి వివిధ కారణాలతో ప్రభుత్వ పథకాల లబ్ధి అందని వారికి పున
పరిశీలించి అర్హత మేరకు వారికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వైవార్షిక నగదు
మంజూరు కార్యక్రమం ద్వారా అందించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు
చేశారు. ప్రభుత్వ పథకాలను అందించడంలో ముఖ్యమంత్రికి ఎలాంటి పక్షపాతం లేదని
అర్హతే ప్రామాణికమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తన దృష్టికి
తీసుకు వచ్చిన పలు సమస్యలను ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది సమక్షంలో
మంత్రి పరిష్కరించారు. డ్రైనేజీ, రహదారుల మరమ్మతులను త్వరలోనే చేపట్టనున్నట్లు
మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మైలా రత్నకుమారి, బీసీ
కార్పొరేషన్ డైరెక్టర్ జెల్లా భూపతి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పిన్నెంటి
మహేష్, ఏఎంసీ చైర్మన్ గంగాధరరావు, గ్రామ సర్పంచి పెనుమాల సునీల్, స్థానిక
ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు
తదితరులు పాల్గొన్నారు.