గ్రేడ్- 2 విఆర్ఓల ప్రొబిషన్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై త్వరలో విజయవాడలో
రాష్ట్ర కమిటీ సమావేశం
రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర
రాజు
విజయవాడ : ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని గ్రామాలలో సర్వేయర్లు ఉన్నందున గ్రామ
రెవెన్యూ అధికారులకు సర్వే శిక్షణ తప్పని సరి అన్న నిబంధనలను పూర్తిగా
తొలగించాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి
రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
అలాగే ప్రస్తుతం వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రేడ్- 2 విఆర్ఓల
ప్రొబిషన్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై త్వరలో విజయవాడలో రాష్ట్ర కమిటీ
సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో విఆర్ఓల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి
కొంతమంది అధికారులు తీరుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని
చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో మండల స్థాయిలో మాత్రమే సర్వేర్లు
ఉండేవారని, కానీ ప్రస్తుతం గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రతి గ్రామానికి ఒక
సర్వేయరును ప్రభుత్వం నియమించిందని, అందువల్ల ప్రస్తుతం పని చేస్తున్న గ్రామ
రెవెన్యూ అధికారులకు సర్వే శిక్షణ సర్వే ట్రైనింగ్, కేవలం ఇప్పుడు గ్రేడ్
2వారి ప్రొఫెషన్ కి, గ్రేడ్ వన్ వారికి ప్రమోషన్ కొరకు పాత నిబంధనలతో కంటిన్యూ
చేస్తున్నారు. ప్రస్తుతం నిబంధనలు మార్పు చేస్తూ, గ్రేడ్ 2 వారికి, సర్వే
ట్రైనింగ్ ఎగ్జామ్స్ తో సంబంధం లేకుండా వెంటనే ప్రొబిషన్ డిక్లేర్ చేయాలని
డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గ్రేడ్ 2 విఆర్ఓల సర్వే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఈనెల 27వ తారీఖున
విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, మూడు ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. మూడు
ప్రాంతాల్లో సుమారు 1350గ్రేడ్ 2 వీఆర్వోలు సర్వే ఎగ్జామ్ లో పాల్గొనడం
జరిగింది.2020సం”లో వీఆర్ఏ నుండి గ్రేడ్ 2 వీఆర్వోలు గా సుమారు 3795 మందిని
కండిషనల్ అపాయింట్మెంట్ గా ప్రభుత్వం నియమించడం జరిగింది. వీరందరూ ఒక
సంవత్సరంలో సర్వే ట్రైనింగ్ ఎగ్జామ్ పాస్ కావాలని అలాగే సిపిటి ఎగ్జామ్ పాస్
కావాలని నిబంధనలు పెట్టడం జరిగింది. కానీ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్
రికార్డ్స్ కమిషనర్ వారు వీరికి 2022 సంవత్సరం వరకు సర్వే ట్రైనింగ్ ఇవ్వడం
గాని, సర్వే ఎగ్జామ్ నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ
అధికారుల సంఘం ఈ విషయాన్ని సీసీఎల్ఏ వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే
వీరికి సర్వే ట్రైనింగ్ ఇచ్చి సర్వే ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశాలు
ఇచ్చారన్నారు. దానిలో భాగంగానే 2022 ఆగస్టు నెల నుండి రాష్ట్రవ్యాప్తంగా 4
బ్యాచులుగా సర్వే ట్రైనింగ్ నిర్వహించి, నవంబర్ నెల లో సర్వే ఎగ్జామ్
నిర్వహించారని, 2022 డిసెంబర్ నెలలో సర్వే రిజల్ట్స్ ఇచ్చారని చెప్పారు.
గతంలో ఉన్న సర్వేఎగ్జామ్ ప్రకారం పాస్ మార్కులు 40 కాకుండా 50 మార్కులతో
రిజల్ట్స్ ఇవ్వడం వల్ల, 3531 మంది సర్వే ఎగ్జామ్ రాస్తే కేవలం 18 00 మంది
మాత్రమే సర్వే ఎగ్జామ్ పాస్ కావడం జరిగిందని, ఈ విషయమై సర్వే సెటిల్మెంట్
ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ని కలిసి పాస్ మార్కులు 40గా నిర్ణయం తీసుకుని
రివైజ్డ్ లిస్టు ఇవ్వాలని కోరిన సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్
వారు నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి, స్పెషల్ చీఫ్
సెక్రటరీ రెవిన్యూ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం సర్వే ఎగ్జామ్ పాస్
మార్కులు 40గా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అప్పట్లో సర్వే సెటిల్మెంట్
ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా ఇంచార్జిగా ఉన్న సిసిఎల్ఏ సెక్రెటరీ ఇంతియాజ్
40 పాస్ మార్క్స్ తో రివైజ్డ్ లిస్టు ఇవ్వడం వల్ల మరో 400 మంది సర్వే ఎగ్జామ్
పాస్ అయ్యారని, మిగిలిన సుమారు 1400 మందికి సర్వే సప్లమెంటరీఎగ్జామ్
నిర్వహించాలని, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ని కోరిన సర్వే
సప్లమెంటరీ ఎగ్జామ్ నిర్వహించుకోవడంతో మరల గౌరవ చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి ,
స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ వారి దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం వెంటనే
సర్వే సప్లమెంటరీ ఎగ్జామ్ నిర్వహించాలని, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్
రికార్డ్స్ కమిషనర్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.