వెలగపూడి : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాలను
సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు
చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా
వెంకటేశ్వర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తితిదే బోర్డు సభ్యులుగా
ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి
నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిని తితిదే బోర్డు సభ్యులుగా
తొలగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల
మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.