ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు
వెలగపూడి : తెలుగు వాడుక భాషా
ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని
ఈ నెల 23 నుండి నిర్వహిస్తున్న తెలుగు భాషా చైతన్య వారోత్సవాలు విజయవంతంగా
కొనసాగుచున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు,
తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి.విజయబాబు తెలిపారు.
సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో
మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాను సారం నిర్థిష్టమైన
కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్న ఈ వారోత్సవాలు నిరంతరాయంగా
కొనసాగుతున్నాయన్నారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో
ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో ఎంతో ఘనంగా ఈ తెలుగు భాషా చైతన్య
వారోత్సవాలు నిర్వహించండం జరుగుచున్నదన్నారు. ఈ నెల 23 వ తేదీన గుంటూరు లోని
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ తెలుగు భాషా చైతన్య
వారోత్సవాలు 29 వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే
కార్యక్రమంతో ముగుస్తాయన్నారు. ఈ నెల 24 వ తేదీన విజయవాడ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ
కళాశాలలోను, 25 వ తేదీన విజయవాడలోని ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలోను, 26 వ తేదీ
ఉదయం విజయవాడలోని బెజవాడ బార్ అసోసిషియేషన్ లోను, సాయంత్రం గుంటూరులోని
వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలోను, 27 వ తేదీన విజయవాడలోని ఘంటసాల సంగీత
విశ్వవిద్యాలయంలోను ఎంతో ఘనంగా ఈ తెలుగు భాషా చైతన్య వారోత్సవాలను నిర్వహించడం
జరిగిందని ఆయన తెలిపారు.

అదే విధంగా సాయంత్రం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో తెలుగు
భాష, సాహిత్యంలో మంచి ప్రతిభ కనబర్చిన రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సన్మాన
కార్యక్రమం నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్ రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక
వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ తదితరులతో పాటు
సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు.
రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ, వెంకటయ్య ఈ సమావేశంలో
పాల్గొన్నారు.