ప్రతి రోజు ప్రజలలో ఉంటాం
స్థానిక కార్పొరేటర్ డివిజన్ సమస్యల కన్నా దేశ సమస్యల కోసం మాట్లాడుతుంటడు
విజయవాడ : స్థానిక 50వ డివిజన్ లోగల పలు ప్రజా సమస్యలు పరిష్కారానికై సోమవారం
మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
అధికారులు నాయకులతో కలసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ రోజు 50వ డివిజన్ క్రింద ప్రాంతంలో
పర్యటించడం జరిగిందన్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి విస్తృతంగా
పర్యటించానని, గతంలో డివిజన్ అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. నేడు వైసీపీ వచ్చాక
అభివృద్ది చేసినట్లు తెలిపారు. కొంత మంచినీటి సమస్య ఉందని, దానిని
అధిగమించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ డివిజన్
సమస్యల కన్న దేశ సమస్యల కోసం మాట్లాడుతుంటాడని అన్నారు. ప్రతి రోజు ప్రజలలో
ఉంటాం అని తెలిపారు. గడప గడపకు వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యల పరిష్కార పురోగతి
కోసం డివిజన్ లో పర్యటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నగర మేయర్
రాయన భాగ్యలక్ష్మి, డివిజన్ వైసీపీ ఇంఛార్జి బంక విజయ,బంక శివ,బంక
చాముండేశ్వరి, సైకం సాయి బాబు, పితా మోహన్, పితా బుజ్జి, కామరాజ్ హరీష్
కుమార్, రవూఫ్, నాని, సంభాని మౌనిక, విజయ శంకర్, బి రాము, నాని, రమేష్, బోయి
నరసింహ, ఉమ్మారెడ్డి శంకర్ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నగరపాలక
సంస్థ అధికారులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు సచివాలయ సిబ్బంది
పాల్గొన్నారు.