విజయవాడ : ఇండియాలోని ప్రముఖ దుస్తులు తయారీదారులు, వ్యాపారుల సమూహంలో ఒకటైన
అపెరల్ మాన్యుఫ్యాక్చర్స్ ఆఫ్ ఇండియా (ఏఎంఐ) చెన్నై ట్రేడ్ సెంటర్లో నాలుగు
రోజుల మెగా సౌత్ కాంక్లేవ్ – అద్వైత్ 2.0 విజయవంతంగా ముగిసింది. దక్షిణ
భారతదేశంలో ఏఎంఐ 40వ ఫెయిర్లో రెండు వేల కంటే ఎక్కువ మంది రిటైలర్లు
హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి దాదాపు రెండు వందల మంది రిటైలర్లు
హాజరయ్యారు. నాలీస్ సిల్క్స్, శోభ, పోతీస్, ఆర్ ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా
ప్రైవేట్ లిమిటెడ్, మర్రి రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, కళామందిర్, కిసాన్,
మైసూర్ ఎంపోరియం, వోల్గా డ్రెస్సెస్ గుల్బర్గా, అశోక వల్లీయూర్, పచ్చయపాస్,
కేవీ టెక్స్, జేచంద్రన్ టెక్స్టైల్, జేచంద్రన్ టెక్స్టైల్ వంటి ప్రముఖ
రిటైలర్లు హాజరయ్యారు. జీవీ మాల్ అద్వైత్ 2.0కి ఈ సంవత్సరం ఎల్ఎఫ్ఎస్ , చైన్
స్టోర్ల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఈ సందర్భంగా నిఖిల్ ఫ్యూరియా, ధర్మేష్ నందు
మాట్లాడుతూ అద్వైత్ 2.0 గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు. నాలుగు రాష్ట్రాల
నుంచి వచ్చిన ప్రతిస్పందన అద్భుతమన్నారు. చెన్నై నుంచి ఎల్లప్పుడూ గొప్ప
మద్దతు, ప్రతిస్పందనను చూస్తున్నామన్నారు. ఈ సంవత్సరం దాదాపు 250 కోట్ల
విలువైన అమ్మకపు ఆర్డర్లను సంపాదించామని, గత రెండు మూడు సంవత్సరాలలో మందగమనం
తర్వాత మళ్లీ వృద్ధి చెందడానికి కృషి చేస్తున్నందున ఇది మొత్తం పరిశ్రమకు
సానుకూల సంకేతం అన్నారు.. మైరా, ఎన్-టిక్, విమల్ ఫ్యాషన్ కూడా ఉన్నాయన్నారు.
ఒక బలమైన సంఘాన్ని నిర్మించడానికి తయారీదారులు, రిటైలర్లు, ఏజెంట్లు,
సరఫరాదారుల మధ్య అంతరాన్ని తగ్గించడం ఏఎంఐ లక్ష్యం అన్నారు.