అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి..
టీడీపీ కుట్రలు చేస్తుంది.. అప్రమత్తంగా ఉండండి
పల్నాడు నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి
నరసరావుపేట : పల్నాడు జిల్లాలో 2019లో గెలిచిన విధంగానే 2024లోనూ పార్టీ
జెండాను ఎగరెయ్యాలని పార్టీ నాయకులకు దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్
కోఆర్డినేటర్,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు..పల్నాడు జిల్లా
వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా విజయసాయిరెడ్డి ఏడు
నియోజకవర్గాల్లోని నాయకులతో విడివిడిగా బుధవారం నరసరావుపేటలో సమావేశం
అయ్యారు. ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్ధితులు,పార్టీ సంస్ధాగత
నిర్మాణం, ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తున్న పథకాలు,సంక్షేమ కార్యక్రమాలు
తదితర అంశాలపై వారితో ఆయన చర్చించారు.. పల్నాడు జిల్లాలో పార్టీ చాలా బలంగా
ఉందని,2019లో ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు,ఎంపి స్థానాన్ని పార్టీ కైవసం
చేసుకుందని..మళ్లీ 2024 కూడా పల్నాడు జిల్లాలో పార్టీ జెండాను
ఎగురవేయాలన్నారు..ఈ ఏడు నియోజకవర్గాలలో పెద్ద ఏత్తున సంక్షేమ
కార్యక్రమాలు,పథకాలు అమలు అవుతున్నాయి.జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరినీ
వదలకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు…రాజకీయంగా కూడా అన్ని
వర్గాలకు ఆయన రాజకీయ పధవులను ఇచ్చారు..అలాగే అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు..మనం
ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలి..అలాగే పార్టీని
సంస్ధాగత నిర్మాణం త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఎమ్మెల్యేలను ఆయన కోరారు.
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవలేక..అనేక కుట్రలను
చేస్తుంది…పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. గొడవలు పెట్టి శాంతి
భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తుంది… కార్యకర్తలు సంయవనం
పాటించేలా చూడాల్సిన అవసరం ఉంది…ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా పార్టీ గెలుపు
కోసం కృషి చెయాలని పార్టీ నాయకులకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు
జిల్లా వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో వైద్య
ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని,రాష్ట్ర జలవనరుల శాఖ
మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు,మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల
ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు,
పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావులతో దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్
కోఆర్డినేటర్,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విడివిడిగా సమావేశాలు
నిర్వహించారు.