కమిటీ చైర్మన్ మహమ్మద్ ముస్తఫా అద్యక్షతన వెలగపూడిలోని శాసన సభ సమావేశ
మందిరంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మహమ్మద్ నవాజ్ బాషా,
కిలారి రోశయ్య, కాంట్రాక్టర్ ఇషాక్, పి.వి. సిద్ధ రెడ్డి, రుహుల్ల తదితరులు
పాల్గొన్నారు. శాసనసభ ఉప కార్యదర్శి కె.రాజ కుమార్ ఈ కమిటీ సమావేశ
ప్రారంభోపన్యాసం చేస్తూ కమిటీ విధివిధానాలు, నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను
సభ్యులకు వివరించారు.
ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలోని అల్ప
సంఖ్యాక వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం
అత్యంత ప్రాధాన్యత నిస్తునదని, ఆ ఉద్దేశ్యంతోనే ఈ కమిటీనీ ఏర్పాటు చేయడం
జరిగిందన్నారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వక్ఫ్
బోర్డు ఆస్తులు, 22 A జాబితాలోని స్థలాలు సంరక్షణ, మైనారిటీ భవనాల నిర్మాణం,
అర్హులైన మైనారిటీలకు విదేశీ విద్య పథకంతో పాటు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ
విస్తృత స్థాయిలో అందజేయడం వంటి అంశాలను ఈ సమావేశంలో సుదీర్ఝంగా చర్చించారు.
మైనారిటీలకు సంబందించిన అంశాలను అన్నింటినీ మరింత సుదీర్ఝంగా చర్చించేందుకు
వచ్చే నెల 11 వ తేదీన కమిటీ సమావేశం అవ్వాలని నిర్ణయించారు. కమిటీ చైర్మన్,
సభ్యులకు శాసనసభ ఉప కార్యదర్శి కె.రాజ కుమార్ పుష్పగుచ్చాలు అందజేస్తూ
ధన్యవాదములు తెలిపారు<