వెలగపూడి : మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై దాడులు చేయడంపై హైకోర్టులో ఏపీ
ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో సీఐడీ దాడులు
చేయడానికి వీలు లేదంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చిట్‌ఫండ్ చట్టంలోని
నిబంధనల ప్రకారం చిట్ రిజిస్టార్ మాత్రమే తనిఖీలు నిర్వహించవచ్చని హైకోర్టు
పేర్కొంది. చిట్ రిజిస్టార్ కూడా కార్యాలయ పనివేలల్లో మాత్రమే తనీఖీలు
చేయాలని ఆదేశించింది. ఇతర శాఖల అధికారులు ఎవ్వరూ కూడా తనిఖీలు చేసేందుకు
వీలులేదని స్పష్టం చేసింది. చందాదారులకు ఫోన్ చేసి వేధింపులు, బెదిరింపులకు
పాల్పడకూడదని హైకోర్టు తెలిపింది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో వివిధ ప్రభుత్వ
శాఖలు తాజాగా తనిఖీలు చేయడాన్ని మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్
చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ
ఉత్తర్వులనువిడుదల చేసింది.