ఏలూరు : అమరావతికి సీఎం జగన్మోహన్ రెడ్డి, పోలవరంకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక
శనిలా పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. బుధవారం
ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి త్రాగునీరు, సాగునీరు, 900 మెగావాట్లు
విద్యుత్తును అందించే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అని అన్నారు. డ్యాం
పోయింది, ప్రాజెక్ట్ గోడ కొట్టుకుపోయిందని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు
చెబుతోందని మండిపడ్డారు. పరిపాలన చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
ఉండటం వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బులు తీసుకురాలేని వ్యక్తి జగన్ అని
వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించాలంటే మొదట నిర్వాసితులకు
డబ్బులు చెల్లించాల్సిందే అని రామకృష్ణ డిమాండ్ చేశారు.