శ్రీకాకుళం : వైయస్సార్సీపి జిల్లా కార్యాలయంలో ఈనెల 15వ తేదీన నిర్వహించే 77వ
స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు
ధర్మాన కృష్ణదాస్ కోరారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మంగళవారం
ఉదయం 9గంటలకు మొదలయ్యే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లాలోని
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పి చైర్ పర్సన్, బీసీ కార్పొరేషన్
చైర్మన్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య శ్రేణులు
హాజరవుతారని అన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో అందుబాటులో గల ముఖ్య నాయకులు,
పార్టీ కుటుంబ సభ్యులు హాజరు కావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణ
దాస్ పిలుపునిచ్చారు.