భూపతిరాజు రవీంద్ర రాజు
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ సర్వేసెస్ అసోసియేషన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు రీ సర్వే విషయంలోతాసిల్దార్లు లక్షలు ఖర్చు పెడుతున్నా
ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని పత్రిక ప్రకటనలో తెలియచేయడాన్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
ఎందుకంటే ఇప్పటివరకు రీ సర్వే , ఇతర రోజువారి పనులతో, వీఆర్వోలు ఎంతో గ్రామ
స్థాయిలో ఇబ్బందులకు గురవుతూ ఉన్న తాసిల్దార్లు ఎవరు కూడా ఉన్నతాధికారులకు
వాస్తవాలుతెలియజేయకుండా కేవలం తాసిల్దార్లు వీఆర్వోలను ఒత్తిడికి గురి చేస్తూ
పైనుంచి ఒత్తిడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం
రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం
అప్పలనాయుడు పేర్కొన్నారు. అన్ని పనులు ఒకేసారి చేయాలని, సెలవు రోజులు పండుగ
రోజుల్లో కూడా తాసిల్దార్లు వీఆర్వోలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని,
రీ సర్వే ఇతర ఖర్చులన్నీ వీఆర్వోలు సర్వేయర్లుతో ఖర్చు పెట్టించడం
జరుగుతుందన్నారు. చాలామంది విఆర్ఓలు, సర్వేలు, ఖర్చుపెట్టిన స్టేషనరీ ఖర్చులు
ఇతర ఖర్చులు కూడా ఇవ్వకుండా, అన్ని పనులు మాత్రం అయిపోవాలని, అన్ని స్థాయిలోని
అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే
గ్రామాల్లో కూడా, వీఆర్వోలు సర్వేలు, స్టేషనరీ ఇతర ఖర్చులతో చాలా ఇబ్బందులకు
గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాసిల్దార్లు ఉన్నత అధికారులు
దృష్టికి తీసుకెళ్లకుండా మా మీదే ఒత్తిడి చేస్తూ మా చేతే డబ్బులు ఖర్చు
పెట్టించడం జరుగుతుందని, కానీ ఇప్పుడు ఏపీ ఆర్ ఎస్ ఏ అధ్యక్షులు బొప్పరాజు
వెంకటేశ్వర్లు తాసిల్దార్లు, రీ సర్వే విషయంలో లక్షలు ఖర్చు పెడుతున్నారంటున్న
మాటలు చూస్తుంటే సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుగా పత్రికల్లో ప్రకటనలు
ఇవ్వడం జరుగుతుందన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాగే
ప్రభుత్వం కూడా వెంటనే వీఆర్వోలు సర్వేలు, రీ సర్వే విషయంలో ఇతర ఖర్చులన్నీ
కూడా నేరుగా వీఆర్వోలు సర్వేలు, ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని వారు
డిమాండ్ చేశారు.