గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని చంద్రబాబు. రుషికొండలో పవన్ కల్యాణ్
విన్యాసాలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా
చేశారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే పవన్ స్పీచ్‌లో ఏమందని సజ్జల
ప్రశ్నించారు. సోమవారం అయన లో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు
ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. అప్పుడు వద్దన్న సీబీఐని ఇప్పుడు
కావాలంటున్నారు. ప్రజలు పిచ్చి వాళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు. పవన్‌కు
అవసరమైన అరేంజ్‌మెంట్స్‌ను చంద్రబాబు చేస్తున్నారు. రిషికొండలో పవన్
విన్యాసాలు చేశారు. తన యజమాని డైరెక్షన్లోనే పవన్ మాట్లాడుతున్నారు. పవన్
కల్యాణ్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం
ఇస్తున్నారన్నారు.
మీకు చట్టాలు, రాజ్యాంగం వర్తించవా : ప్రభుత్వంపై పద్దతి ప్రకారం బురదజల్లే
ప్రయత్నం జరుగుతోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపుతున్నారు. తమకు
చట్టాలు, రాజ్యాంగం వర్తించవన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వారు చేసే తప్పులు
ప్రశ్నిస్తే మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పుంగనూరులో పోలీసులపై
టీడీపీ నేతలు దాడి చేశారు. పోలీసులు సంయమనం పాటించడంతో ముప్పు తప్పింది.
ప్రచారం పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టించారు.
సీఎం జగన్ పాలన అద్భుతం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
పాలన అద్భుతంగా సాగుతోంది. సుమారు 90 శాతం ప్రజలకు సంక్షేమం అందుతోంది.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. పథకాలు అమలవుతున్న
తీరుపై ప్రజల్లో సంతృప్తి ఉంది. మా పాలనపై మాట్లాడటానికి చంద్రబాబుకు అంశాలే
లేవు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి పథకమైనా ఉందా?. ప్రస్తుతం అమలవుతున్న
పథకాలు అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నలు సంధించారు.