1.93 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం : మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత
తిరుపతి అభివృద్దికి నిరంతరం కృషి : డిప్యూటీ మేయర్ భూమన అభినయ్
తిరుపతి : తిరుపతి లో సోమవారం రెండు ప్రీ లెప్టులను, ఓక రోడ్డు విస్తరణను,
మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం స్పూర్తితో రూపొందించిన దండి మార్చ్ విగ్రహాల
ఐలాండ్ ను తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్, తిరుపతి శాసనభ్యులు భూమన
కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష,
కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ప్రారంభించారు. ఈ
సంధర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్ వారి దమనకాండకు
వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారని, ఉప్పు మీద పన్నును
వ్యతిరేకిస్తూ 1930 మార్చి12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి దండి వరకు జరిపిన
సాహసోపేతమైన పాద యాత్ర యావత్ దేశాన్ని కుదిపేసిందని చెప్పారు. గాంధీజీ
బిగించిన ఆ పిడికిలి దేశమంతా ఉన్న 30 కోట్ల మందిని ఒక్క తాటిమీదకు
తీసుకొచ్చి, సింహాలై గర్జించి బ్రిటీష్ వాళ్లను ప్రారదోలడానికి తొలి వేదికగా
దండి సత్యాగ్రహం మారిందని భూమన గుర్తు చేసారు. 76 వ స్వాతంత్ర్య దినోత్సవం
సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, నగర
ప్రజలకు కానుకగా దండి సత్యాగ్రహ విగ్రహ రూపాన్ని తిరుపతి ప్రజలకు అందించిందని
భూమన కరుణాకర రెడ్డి ప్రసంశించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్
శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి ప్రజల ట్రాఫిక్ కష్టాలను కొంత
మేరకు తగ్గించే ఆలోచనలతో ప్రకాశంరోడ్డు నుండి కోర్టు సముదాయాలకు వెల్లే
మార్గాన్ని 32 లక్షలు వెచ్చించి వెడల్పు చేయడం, టౌన్ క్లబ్ వద్ద 38 లక్షల
ఖర్చుతో ప్రీ లెప్ట్ ను ఏర్పరిచి, టౌన్ క్లబ్ సర్కిల్ నుండి అలిపిరి వరకు
వెల్లే మార్గానికి నూతనంగా పురంధర దాస్ పేరును పెట్టడం జరిగిందన్నారు. ఎస్వీ
మ్యూజిక్ కళాశాల వద్ద 46 లక్షలతో మరో ప్రీ లెప్ట్ తో బాటు, సంగీత వాయిధ్య
పరికరాలను నగర సుందరీకరణలో భాగంగ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముత్యాలరెడ్డి
పల్లె సర్కిల్ వద్ద ఉప్పు సత్యాగ్రహం చేపట్టిన మహాత్మాగాంధీ ఉధ్యమ స్పూర్తిని
ప్రతిబంబించే దండి మార్చ్ విగ్రహాలను 81 లక్షలతో నగరపాలక సంస్థ ఏర్పాటు
చేసినట్లు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.
డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రజలకు అవసరమైన
నూతన రహదారులను నిర్మించడం, అదేవిధంగా పాత రోడ్లను ఆధునికరించడం
జరుగుతున్నదన్నారు. తిరుపతి నగరాభివృద్దికి, ప్రజల సమస్యలు తీర్చేందుకు తమ
కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తునే వుంటుందని భూమన అభినయ్ స్పష్టం చేసారు. ఈ
కార్యక్రమాల్లో స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, నరశింహాచారి,
కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, సంధ్యా, సునీత, శేఖర్
రెడ్డి, మోహన్, నారాయణ, నరేంధ్ర, కో ఆప్షన్ సభ్యులు ఇమామ్ షాహేబ్, రుద్రరాజు
శ్రీదేవి, ఏసి సునీత, ఎస్.ఈ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు
దేవిక, రవీంధ్రరెడ్డి, మహేష్, టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్రా రెడ్డి,
ఆర్టీసి కార్పొరేషన్ డైరెక్టర్ సునీల్ చక్రవర్తి, నాయకులు ఐ.సి.ఎస్ రెడ్డి,
శేఖర్ రెడ్డి, పైడి చంద్ర, అనీల్, తాళ్ళూరి ప్రసాద్, దేవదానం, తలారీ రాజేంద్ర,
శ్యామల తదితరులు పాల్గొన్నారు.