విజయనగరం : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశ సమైక్యతను చాటుతూ
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన కళాకారులు, విద్యార్థులు నగరంలో
ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. నా భూమి – నా దేశం కార్యక్రమంలో భాగంగా
మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల – సాంస్కృతిక శాఖ సంయుక్త
ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యక కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగా జాతీయ
స్ఫూర్తిని చాటుతూ దేశభక్తి నినాదాలు చేస్తూ కళాకారులు, విద్యార్థులు
ర్యాలీ నిర్వహించారు. సంగీత, నృత్య కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ
సింహాచలం మేడ, కోట జంక్షన్, గురజాడ స్వగృహం, గురజాడ జంక్షన్ మీదుగా
సాగింది. వర్షంలో తడుస్తూ ర్యాలీ నిర్వహించి విద్యార్థులు, కళాకారులు
దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య
కళాశాల ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు, కళాకారులు, విద్యార్థులు తదితరులు
పాల్గొన్నారు.