ఎన్జీఓస్ రాష్ట్ర మహా సభల పోస్టర్ల ప్రదర్శనలో పాల్గొన్న డీటీసీ యం పురేంద్ర
విజయవాడ :ఈ నెల 21, 22 తారీఖులలో నిర్వహించే ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర మహా సభలను
విజయవంతం చేయాలని ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ రఘుబాబు
కోరారు. స్థానిక బందర్ రోడ్ లోని డిటిసి కార్యాలయం లో సోమవారం డీటీసీ యం
పురేంద్రను ఆ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈనెల 21, 22వ తారీకులలో
ఏపీ ఎన్జీవో మహాసభలు విజయవాడలో నిర్వహించడం జరుగుతుందని ఆ సభలకు అతిధులుగా
విచ్చేయాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ రఘుబాబు, జోనల్
అధ్యక్షుడు ఎం రాజుబాబు వారి బృందం డీటీసీ యం పురేంద్రను ఆహ్వానించారు. ఈ
సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ను డీటీసీ యం పురేంద్ర
ఉద్యోగ సంఘ నాయకులు ప్రదర్శించారు. డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ ఎన్నో
ఏళ్లుగా ఉద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ఒప్పించి ఉద్యోగులకు సంబందించిన
ఎన్నో రాయితీలను కల్పిస్తూ ఉద్యోగులకు అండగా ఉంటున్నటువంటి సంఘం ఏపీ ఎన్జీవోస్
సంఘం అని ఆయన కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐ రఘుబాబు మాట్లాడుతూ ఈనెల 21 22
తారీకుల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఏపీ ఎన్జీవోస్
రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర
ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారని అధిక సంఖ్యలో
రవాణాశాఖ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జోనల్
అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల
డిమాండ్ల సాధనకై ప్రభుత్వాన్ని ఒప్పించి, సమస్యలను పరిష్కరించగల ఏపీ ఎన్జీవోస్
రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి
శివారెడ్డి నాయకత్వంను బలపరుస్తూ ఉద్యోగుల ఐక్యతను చాటే విధంగా ఈసభలకు
ఉద్యోగులు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ఉద్యోగ సంఘ
నాయకులు వి ఉమామహేశ్వరి, ఎ బాలరాజు, యం రాజుబాబు, కే వి వి నాగమురళి, సిహెచ్
శ్రీనివాసరావు, కె రామచంద్ర రాజు, చంద్రకళ, టెక్నికల్ అధికారుల సంఘం నాయకులు
శ్రీనివాస్, డివి రమణ, రవాణాశాఖ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు
కే భద్రాచలం ఉన్నారు.