విజయవాడ : ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ప్రభుత్వ పథకాల అలంకృత శకటాలను
వేడుకలలో ప్రదర్శ నకు సిద్ధం చేయాలని సమాచార శాఖ కమీషనర్ టి. విజయకుమార్
రెడ్డి అధికారులను ఆదేశించారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో
ప్రదర్శించనున్న శకటాలను సోమవారం సాయంత్రం సమాచార శాఖ కమీషనర్ టి. విజయకుమార్
రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఇందిరా గాంధీ
మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే 77వ రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ
వేడుకలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై 13 అలంకృత శకటాల ప్రదర్శన
ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో
రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు
తెలిపారు. వివిధ శాఖలకు చెందిన శకటాలను స్వాతంత్య్ర దినోత్సవ వేడకలలో
ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శకటాలను అందరినీ ఆకర్షించే
విధంగా ప్రదర్శనకు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు సమాచార శాఖ కమిషనర్ టి
విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. శకటాల పరిశీలనలో కమీషనర్ వెంట సమాచార శాఖ
జాయింట్ డైరెక్టర్లు పి. కిరణ్ కుమార్, టి. కస్తూరి, పాల్గొన్నారు.