రెడ్డి నిమగ్నం
తిరుపతి : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్ గా చంద్రగిరి 2024
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ
మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్,
చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్
రెడ్డి అప్పగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం
కానున్నారు.
చంద్రగిరి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా : ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్
రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2024
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గడప గడపకు పర్యటిస్తున్న క్రమంలో ప్రతిపక్ష
పార్టీ టిడిపి నేతలు విమర్శలకు దిగారు. ఏ అధికారిక హోదాలో మోహిత్ రెడ్డి
పర్యటిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలా వెంట తిరుగుతున్నారని
జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదులు చేశారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి
భాస్కర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. 2024
ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతో మమేకమవడం, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్న
క్రమంలో సీఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తుడా ఛైర్మెన్ బాధ్యతలు అప్పగించారు.
ఇకపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో అధికారిక తుడా
ఛైర్మెన్ హోదాలో పర్యటించనున్నారు.