గ్యారంటీ రుణాలు, ప్రజాపద్దు రుణాలు అదనం
అనేక లెక్కలు ఇప్పటికీ రహస్యం
అమరావతి : అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సృష్టిస్తోంది. కేంద్రం
అనుమతించిన రుణాలను అయినకాడికి తెచ్చి వాడేస్తోంది. పుట్టినచోటల్లా అప్పులు
తెచ్చి ఆర్థికనావను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి
నాలుగు నెలల్లోనే రూ.28,500 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది.
రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో రుణం పొందాలంటే కేంద్ర
ఆర్థికశాఖ అనుమతులు అవసరం. ఆ మేరకు కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి
తొలి తొమ్మిది నెలల్లో రూ.30,275 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. కానీ,
దాదాపు ఇంత అప్పునూ దాదాపు నాలుగు నెలల్లోనే రాష్ట్రం తీసేసుకుంటోంది. తాజాగా
మంగళవారం 7.36% వడ్డీతో 15 ఏళ్ల కాలపరిమితికి రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.
దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రుణం రూ.28,500 కోట్లకు చేరుకుంది. ఇక
కేంద్రం ఇచ్చిన అనుమతి మేరకు రూ.1,775 కోట్ల రుణానికే వెసులుబాటు ఉంది. జులై
నెలలోనే ఈ మొత్తం తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆగస్టు నుంచి మళ్లీ
కొత్త రుణాల కోసం కేంద్ర అనుమతుల కోసం రాష్ట్రం ప్రయత్నాలు చేయాలి.
సగటున నెలకు రూ.7,500 కోట్ల పైమాటే : రాష్ట్రప్రభుత్వం ఏప్రిల్‌లో రూ.6,000
కోట్లు, మే నెలలో రూ.9,500 కోట్లు, జూన్‌లో రూ.7,000 కోట్లు సమీకరించింది. జులై
నెలలో ఇంతవరకు రూ.6,000 కోట్లు తీసుకుంది. కేంద్రం నుంచి నెలకు సగటున రూ.3,400
కోట్ల రుణం తీసుకునేందుకు వీలున్నా.. సగటున నెలకు రూ.7,500 కోట్ల వరకు రుణం
తీసుకున్నట్లవుతోంది. ఇవి కాకుండా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వివిధ
కార్పొరేషన్ల ద్వారా కూడా రుణాలు సమీకరిస్తోంది. ఇంకా ప్రజాఖాతా ద్వారా ఇతర
రూపాల్లో ప్రభుత్వానికి వచ్చే నిధులనూ రుణంగా వినియోగించుకుంటోంది.
వాటిగురించి కాగ్ ప్రతి నెలా రాష్ట్రప్రభుత్వాన్ని అడుగుతున్నా బయటకు
వెల్లడించట్లేదు.
అప్పుల లెక్కల్లో మాయ : మరోవైపు ప్రభుత్వం వెల్లడించే అప్పుల లెక్కల్లో మాయ
కనిపిస్తోంది. రిజర్వుబ్యాంకు రుణాలకు సంబంధించి వెల్లడిస్తున్న లెక్కలకు,
కాగ్‌కు ఇస్తున్న లెక్కలకూ పొంతన లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెల
లెక్కలను కాగ్ తన వెబ్సైట్లో ఉంచింది. ఈ లెక్కలతో.. రిజర్వుబ్యాంకు ప్రతి
మంగళవారం ఆయా రాష్ట్రాల అప్పులపై వెల్లడించే సమాచారాన్ని పోల్చిచూస్తే
విస్తుపోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే కాగ్‌కు సమర్పించిన లెక్కల
ప్రకారం.. రూ.23,548.04 కోట్ల రుణం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో నికర
ప్రజారుణం రూ.7,801.58 కోట్లు, నికర పబ్లిక్ అకౌంట్ నుంచి రూ.10,767.03 కోట్లు
ఉన్నాయని వెల్లడించింది. అదే మే నెలకు వచ్చేసరికి మొత్తం అప్పు రూ.25,292.68
కోట్లుగా లెక్కల్లో చూపారు. అంటే తేడా కేవలం రూ.1744.67 కోట్లే. కానీ, మే
నెలలోనే రిజర్వుబ్యాంకు సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం రూ.9,500 కోట్ల
రుణం తీసుకుంది. లెక్కల్లో ఈ వ్యత్యాసం చర్చనీయాంశమవుతోంది. ఇంత పెద్దమొత్తంలో
రుణం ఎక్కడ చెల్లించి ఈ నికర రుణం లెక్కించారన్నది
ప్రశ్నార్థకమవుతోంది.అప్పుల్లో ఏపీ సరికొత్త రికార్డు
బహిరంగ మార్కెట్ రుణమే రూ.28,500 కోట్లు

రుణం ఎక్కడ చెల్లించి ఈ నికర రుణం లెక్కించారన్నది ప్రశ్నార్థకమవుతోంది.