విజయవాడ : ముస్లిం కమ్యునిటీకి చెందిన దూదేకుల వర్గానికి సంబందించిన సమస్యలు
పరిష్కారానికి తాను క్రుషిచేస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురందేశ్వరి హామీ ఇచ్చారు. ఆనాదిగా మీరంతా వివక్షకు గురౌతున్న విషయాన్ని
పరిశీలించాను, గమనించాను కూడా అందువల్ల మీ సమస్యలు పరిష్కరించడానికి తనవంతు
కృషి చేస్తానన్నారు. ముస్లిం కమ్యునిటీకి సంబందించిన వక్ఫ్ బోర్డు, హజ్
కమిటీ, ఉర్ధు అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్ కమిటీ, అంజుమన్ కమిటీల్లో న్యాయం
జరగడం లేదని బిజెపి అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి గారి దృష్టికి దూదేకుల
సామాజిక వర్గ నేతలు తీసుకుని రావడం తో పురందేశ్వరిగారు స్పందిస్తూ
దూదేకులవర్గానికి అందాల్సినంత సమన్యాయం అందేందుకు తాను సహకరిస్తానని హామీ
ఇచ్చారు. దూదేకుల వర్గానికి ఇంతవరకు రాజ్యాధికారం దక్కలేదని జనాబా ప్రాతిపదికన
న్యాయ జరగలేదని తమకు ఏ రాజకీయ పార్టీ కూడా ఎమ్మెల్యే సీటు ఇచ్చిన
సందర్భంలేదని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం కార్పోరేషన్
ఇచ్చినప్పటికీ నయాపైసా కూడా విదిల్చలేదన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో
దూదుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె పీర్ మహ్మద్, రాష్ట్ర మహిళాఅధ్యక్షురాలు
డాక్టర్ డి మస్తానమ్మ, సంఘ నేతలు మహ్మద్ ఖాజావల్లీ, అహ్మద్ అరీఫ్, నాగూర్
వల్లీ తదితరులు ఉన్నారు.