అమరావతి : క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను కలిసిన కె రహేజా గ్రూపు
ప్రెసిడెంట్ నీల్ రహేజా మంగళవారం కలిశారు. ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్
మహాజన్, కె రహేజా గ్రూప్ ఆంధ్రా, తెలంగాణా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె
శ్రావణ్ కుమార్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్
నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్
రెడ్డిని కె రహేజా గ్రూపు ప్రతినిధులు ఆహ్వానించారు. విశాఖలో 6 లక్షల
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. మూడేళ్లలో
రూ.600 కోట్లు కె రహేజా గ్రూప్ పెట్టుబడి పెట్టనుంది. ఈ సమావేశంలో
ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులపై ముఖ్యమంత్రితో కె రహేజా గ్రూపు
ప్రతినిధులు చర్చించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ
అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.