విజయవాడ : ఆంధ్ర రాష్ట్రమంతా గౌరవిస్తున్న వాలంటీర్ వ్యవస్థ పైన,
అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని గీత
ఫౌండేషన్ చైర్ పర్సన్ దేవరపల్లి గీత అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల
మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై, నిరసన తెలిపినటువంటి
ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు, పోతుల సునీత ని,
విమర్శిస్తున్న తెలుగు దేశo పార్టీ నాయకుల మాటలను ఖండిస్తున్నామన్నారు.
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీకి నాయకులకు, మహిళల మీద
గౌరవం లేకపోగా, తిరిగి మహిళల మీద దౌర్జన్యాలు చేయడం, మహిళలను ఇబ్బంది పెట్టడం
వారికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ
గత తెలుగుదేశం ప్రభుత్వం మహిళల మీద దౌర్జన్యాలు చేసినా వారి విజ్ఞతకే
వదిలేశామని, ఇప్పుడు నేరుగా మహిళలందరూ ఆదర్శవంతంగా తీసుకుంటున్నటువంటి
వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత పై చేస్తున్న ఈ అసత్య
ప్రచారాలు సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని మహిళా లోకం యావత్తు దీన్ని
ముక్తకంఠంతో ఖండిస్తుందని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం
నాయకులకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.