పవన్ కళ్యాణ్ వాలంటీర్లను అవమాన పరిస్తే సహించేది లేదు
మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ : చంద్రబాబు కి కట్టు బానిస గా అమ్ముడుపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని
జనసైనికులు అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు డైరెక్ట్ గా రావడానికి భయం కాబట్టి
పవన్ కళ్యాణ్ ని వాడుతున్నారని విమర్శించారు. 2024 పోటీ చేయాలంటే పవన్
కళ్యాణ్ కి దమ్ము, సత్తా లేదని ఎద్దేవా చేశారు. స్థానిక పశ్చిమ
నియోజకవర్గంలోని 49,50 వ డివిజన్ లలో సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమం
జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులకు సంబంధిత ధృవీకరణ
పత్రాలను అందించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు
అందరూ విజయవంతంగా చేస్తున్నారు. 11రకాల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నాం
అన్నారు.గడప గడప లో వచ్చిన సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామని
తెలిపారు. గతంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్న చంద్రబాబు చెయ్యలేని పనులను మేము
చేస్తున్నామని అన్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ పార్టీ చట్ట పట్టాలు వేసుకొని తిరిగిన సమయం
లో కూడా ప్రజలకు మంచి చేయలేదని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లను
అవమానపరిస్తే సహించేది లేదన్నారు.రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తి పవన్
కళ్యాణ్ అని అన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ
చేస్తారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టిన
వ్యక్తులపై ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్,
50వ డివిజన్ బంక విజయ, డివిజన్ కార్పొరేటర్ బోయి సత్తిబాబు, డివిజన్ నాయకులు,
కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు నగర పాలక సంస్థ, రెవిన్యూ
అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.