కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ
విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాడ
మాసం ముగింపు సందర్భంగా సోమవారం ప్రతి సంవత్సరం వలె ఆలయ కార్యనిర్వహణాధికారి
అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. జమ్మిదొడ్డి వద్దకు ఆలయ ట్రస్ట్ బోర్డు
చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్
బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది విచ్చేశారు. అనంతరం జమ్మిదొడ్డిలోని
దేవతా మూర్తుల వద్ద వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యములు, అమ్మవారి
నామ స్మరణల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి, ఆలయ చైర్మన్, కార్య
నిర్వాహణాధికారి కొబ్బరికాయలు కొట్టి పవిత్ర సారె కార్యక్రమంను ప్రారంభించారు.
అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్య నిర్వాహనాధికారి
దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పవిత్ర
సారెతో మంగళ వాయిద్యములు, కోలాట ఇతర సాంస్కృతిక కార్యక్రమములు అమ్మవారి జయ జయ
నామ స్మరణల నడుమ ఊరేగింపుగా కనకదుర్గ నగర్, మహా మండపం మీదుగా ఆలయానికి
చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకొని పవిత్ర సారె సమర్పించారు. అనంతరం మహమండపం
6వ అంతస్తులో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ
అర్చకులు పూజలు నిర్వహించి, అందరికీ ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ
ఉప కార్యనిర్వాహనాధికారి పి. గురుప్రసాద్ , స్థానాచార్యులు విష్ణుభట్ల
శివప్రసాద శర్మ దంపతుల వారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, చింతా
సింహాచలం, బచ్చు మాధవీ కృష్ణ, వైదిక సిబ్బంది, వేద పండితులు, అర్చకులు,
కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి ,
ఇంజనీరింగ్ సిబ్బంది, సహాయ కార్యనిర్వాహనాధికారి, కార్యాలయ సిబ్బంది,
కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.