టీడీపీ నేతలు
గుంటూరు : నమ్మినసిద్ధాంతాలకు కట్టుబడి, రాజకీయాలంటే అణగారినవర్గాలను
వృద్ధిలోకి తీసుకురావడమేనని నమ్మి, ఆచరణలో చేసి చూపించిన మహనీయుడు జగజ్జీవన్
రామ్ అని టీడీపీనాయకులు కొనియాడారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ ల బాటలోనే
తెలుగుదేశంపార్టీ, చంద్రబాబునాయుడు దళితవర్గాల అభ్యున్నతికోసం
శ్రమిస్తున్నారని శ్లాఘించారు. జగజ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించినవారిలో
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య, శాసనసభ్యులు డోలా
బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పితాని
సత్యనారాయణ, పత్తిపాటి పుల్లారావు, మాజీఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు,
చిరంజీవులు, శ్రీరామ్ తాతయ్య, మాజీఎమ్మెల్సీ జగదీశ్, పార్టీ సీనియర్ నాయకులు
బేబీ నాయన, ఏ.వీ.రమణ, బొద్దులూరి వెంకటేశ్వరరావు, కోడూరిఅఖిల్, , పరుచూరి
కృష్ణ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు ఉన్నారు.
బాబూజగజ్జీవన్ రామ్ బాటలోనే తెలుగుదేశంపార్టీ, చంద్రబాబు నాయుడు, దళిత బడుగు
బలహీనవర్గాల సంక్షేమంకోసం కృషిచేస్తున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా
బాలవీరాంజనేయస్వామి అన్నారు. “ భారతదేశ ఉపప్రధానిగా సేవలందించి, తాను నమ్మిన
సిద్ధాంతాలకు కట్టుబడి, అణగారినవర్గాలకోసం బాబూ జగజ్జీవన్ రామ్ చేసిన కృషి
అనన్యసామాన్యమై నది. బాబూజగజ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల ఆశయాలను
కొనసాగిస్తూ, వారుచూపిన బాటలోనే తెలుగుదేశంపార్టీ దళిత, బడుగు బలహీన
వర్గాలసంక్షేమం కోసం తీవ్రమైన కృషిచేస్తోంది. టీడీపీతరుపున, దళితుల తరపున ఆ
మహానీయుడికి ఘననివాళులు అర్పిస్తున్నామన్నారు.
జగజ్జీవన్ రామ్ బాటలో నడుస్తున్న చంద్రబాబు, అణగారినవర్గాల అభ్యున్నతికోసమే
పేదరికంలేని సమాజ సృష్టికి సిద్ధమయ్యారని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు
అన్నారు. భారతదేశ నాయకుల్లో అణగారినవర్గాలకోసం నిరంతరంపోరాడిన మహానీయుడు
బాబూ జగజ్జీవన్ రామ్. బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి వర్థంతిని జరుపుకుం టున్న
తరుణంలో ఆయన చేసినసేవల్ని ప్రతిఒక్కరూ స్మరించుకోవాలి. అణగారి న వర్గాల
అభ్యున్నతికోసమే చంద్రబాబు పేదరికంలేని సమాజాన్ని సృష్టించాలని నిర్ణయించారు.
సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వపాలన ఉంటుందన్నారు.*
ఇతరవర్గాలతో సమానంగా దళితులకు స్వేచ్ఛ, గౌరవం కల్పించేందుకు జగజ్జీవన్ రామ్
చేసిన పోరాటం మరువలేనిదని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
“జాతిపిత బాపూజీని ఎంతగొప్పగా, ఘనంగా గౌరవించుకొని స్మరించుకుం టామో,
అదేవిధంగా అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ లను భారతజాతి నిత్యం స్మరిం
చుకోవాలి. బాపూజీ తర్వాత బాబూజీ అని పిలిపించుకున్న మహానుభా వుడు జగజ్జీవన్
రామ్. కేంద్రప్రభుత్వంలో ఏపదవి చేపట్టినా, ఆ పదవులకు వన్నెతెచ్చిన
గొప్పవ్యక్తి జగజ్జీవన్ రామ్. దళితులకు ఇతరవర్గాలతో సమాన మైన గౌరవం, స్వేచ్ఛ,
కల్పించేందుకు ఆయనచేసిన పోరాటం మరువలేనిది. అలాంటి గొప్పనాయకుడి ఆశయాలు,
ఆలోచనలకు కొనసాగింపుగా తెలుగు దేశంపార్టీ దళిత, బడుగు బలహీనవర్గాలకోసం
పనిచేస్తోందన్నారు.
రాజకీయాలంటే అన్నివర్గాలకు సమానన్యాయం చేయడమేనని నమ్మి, ఆచరణలో
దాన్నిచేసిచూపించిన గొప్పవ్యక్తి జగజ్జీవన్ రామ్ అని మాజీమంత్రి పితాని
సత్యనారాయణ అన్నారు. “రాజకీయాలంటే అన్నివర్గాలకు సమానన్యాయం చేయడమేనని బలంగా
నమ్మి, ఆచరణలో చేసిచూపించిన వ్యక్తి జగజ్జీవన్ రామ్. బ్యాక్ లాగ్ ఎస్సీ
పోస్టుల భర్తీలో జగజ్జీవన్ రామ్ చూపినచొరవ ఎందరో దళితుల్నిఉన్నతస్థానాల్లో
నిలిపింది. దళిత, బడుగు, బలహీన వర్గాలకోసం నేటితరంనేతలు పాటుపడుతు న్నారంటే
దానికి కారణం జగజ్జీవన్ రామే. ఆయనస్ఫూర్తితో తెలుగుదేశంపార్టీ ఎస్సీవర్గంలోని
మా దిగలకోసం ప్రత్యేకరిజర్వేషన్లు తీసుకొచ్చిందన్నారు.