జిల్లాకు పరిశ్రమలు తీసుకురావాలి
ఎంపీకి జిల్లా సిపిఐ బృందం విజ్ఞప్తి
రాజమహేంద్రవరం : నూతనంగా ఏర్పడిన నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా లో
అమితమైన సహజవనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం
విఫలమైందని, ఎంపీగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవాడ భవానీ దీపంలా
రాజమండ్రిలో గోదావరి తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సిపిఐ జిల్లా
కార్యదర్శి తాటిపాక మధు జిల్లా కార్యవర్గ సభ్యులు
వి కొండలరావు కే జ్యోతి రాజు, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ కోరారు. గురువారం
ఎస్టేట్లో ఎంపీ కార్యాలయంలో సిపిఐ జిల్లా బృందం కలిసి పలు అంశాలను ఆయన
దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ చారిత్రాత్మక
రాజమహేంద్రవరం నగరానికి సమీపంలో దివాన్ చెరువు ఫారెస్ట్ ల్యాండ్స్ అలాగే
గోదావరి మధ్యలో కాటన్ బ్యారేజీ వద్ద పిచ్చుకలంక ఇలాంటి సుందర ప్రదేశాలు
ఉన్నందున వాటిని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంతో పాటు సినీ రంగం కూడా ఇక్కడకు
వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు. జిల్లా అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు
మెరుగుపడతాయని వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాలలో పరిశ్రమలు లేక నిరుద్యోగం
వినయ్ తాండవం చేస్తుందన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ గాని టీచర్
పోస్టులు తదితర పోస్టులు భర్తీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది
నిరుద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీ తొక్కలో తొక్కారని
ఆయన అన్నారు గృహాలు నిరుపేదంగా ఉన్నాయని వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి
వెంటనే జగనన్న గృహాలు ప్రతి ఒక్క ఇంటికి రూ 5 లక్షల ఇవ్వాలని లేకపోతే ఇల్లు
కట్టుకోవడం కష్టసర్యంగా ఉందని ఆయన తెలిపారు. రాజమండ్రి నుండి బయలుదేరుతున్న
రైలులో జనరల్ బోగీలు తగ్గించడం అన్యాయమన్నారు అన్యాయం అన్నారు. తక్షణం ఎంపీ
రైల్వే మంత్రితో మాట్లాడి జనరల్ బోగీలు యధావిధిగా కొనసాగిలా చూడాలన్నారు.