ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలం
జ్యోతిరావు పూలే ఆదర్శంగా సమాజసేవకు ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి
నాడు –నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు
1431 మంది చిరుధ్యోగులను అప్కాస్ లో విలీనం చేయటం చారిత్రాత్మకం
బీసీ సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ , సినిమాటోగ్రఫీ మంత్రి
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
విజయవాడ : అమ్మను మరిపించేలా గురుకుల వసతి గృహాలు ఉండాలని, క్రమశిక్షణకు
ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల అభిరుచులను గమనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ
విద్యను అందించినప్పుడే అత్యుత్తమ ఫలితాలు సాధించగమని రాష్ట్ర బీసీ సంక్షేమ
శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ అన్నారు. బీసీ సంక్షేమ
శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షత్రం లో బుధవారం ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ
వసతి గృహాల్లో పది, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థుల అభినందన సభ
జరిగింది. ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది పదవ
తరగతి, ఇంటర్ ఫలితాల్లో బీసీ రెసిడెన్షియల్, హస్టల్స్ విద్యార్థులు అత్యుత్తమ
ప్రతిభ కనపర్చారని, ఇలాగే ప్రతి ఏడాది మంచి ఫలితాలు సాధించాలన్నారు. పదవ
తరగతి, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా
అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని,
జాతీయ స్థాయిలో మన విద్యార్ధులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని 21 బీసీ
రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
రాబోయే ఏడాదిలో అన్ని స్కూల్స్ లో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు
తెలిపారు. జ్యోతిరావు పూలేను యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి
చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి సమాజ సేవకు అధిక ప్రాధాన్యత
ఇవ్వాలని, బాల్యదశ నుంచే క్రమశిక్షణతో, ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలకు
చేరుకోవాలని విధ్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించటంలో ఉపాధ్యాయుల కృషి
ఎనలేనిదన్నారు.
బీసీ సంక్షేమ శాఖలో ఏజెన్సీ ఆధ్వర్యలో పనిచేస్తున్న చిరుధ్యోగులను అప్కాస్ లో
విలీనం చేయటం గొప్ప విషయమన్నారు. 1431 మంది ఉధ్యోగులను అప్కాస్ లో తీసుకుని
వారికి ఉధ్యోగ భద్రత కల్పించటమే కాకుండా ప్రతి నెలా ఠంచన్ గా ప్రభుత్వ
ఉధ్యోగులతో పాటు జీతం పడేలా చర్యలు తీసుకోవటం శుభపరిణామమన్నారు. అనంతరం పదవ
తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులు,
ఉపాధ్యాయులు, తల్లితండ్రులను మంత్రి చేతుల మీదుగా శాలువాలు కప్పి, మెమెంటోలు,
ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. విద్యార్థులు మరింత కష్టపడి చదివి
ఉన్నత శిఖరాలకు చేరుకుని సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి
చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ
శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరాములు, బీసీ వెల్ఫే ర్ డైరక్టర్ అర్జునరావు,
జ్యోతిరావు పూలే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సోసైటీ సెక్రటరీ కృష్ణమోహన్,
బీసీ వెల్ఫేర్ అడిషినల్ డైరక్టర్ చంద్రశేఖర్ రాజు, జాయింట్ డైరక్టర్లు శ్రీధర్
రెడ్డి, ఉమాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఉధ్యోగులు పాల్గొన్నారు.