నగరి : నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో సమ్మర్ క్యాంపు ను
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా
బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ
విద్యార్థులు క్రీడలలో పాల్గొంటే సమాజంలో ఎలా బ్రతకాలో తెలుస్తుందని అన్నారు.
వేసవి సెలవుల్లో పిల్లలు క్రీడాల్లో పాల్గొనడం వలన మానసిక వికాసం పెరుగుతుందని
తెలిపారు.

ఇండోర్ స్టేడియం ప్రారంభం : నగరి లో ఇండోర్ స్టేడియం ను మంత్రి ఆర్. కె రోజా,
చిత్తూరు ఎస్.పి.రిశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. బాల్ బాడ్మింటన్ ,
షట్టల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్ క్రీడలలో వారు పాల్గొని క్రీడాకారులకు
ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సమావేశం లో నగరి నియోజకవర్గంలోని మునిసిపల్ చైర్మన్లు,
ఎంపీపీ లు, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీ లు, కౌన్సిల్లర్లు, ఎంపీటీసీలు,
సర్పంచ్లు, రాష్ట్ర డైరెక్టర్ లు, కమిటీల చైర్మన్లు, సభ్యులు, ప్రజా
ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.