రావు
విజయవాడ : ప్రభుత్వంలో విలీనం తరువాత ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న
సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు డిమాండ్ చేశారు. ఆ యూనియన్
27వ రాష్ట్ర మహాసభ విజయవాడ నిడమానూరు లోని మురళీ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్
లో జరిగిన సందర్భంగా మాట్లాడుతు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన
తరువాత తమ యూనియన్ చేసిన కృషి మరియు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారి
చొరవతో 2096మంది ఉద్యోగుల ప్రమోషన్ల కు ప్రభుత్వం అనుమతి లభించింది అని,
వారికి పి ఆర్ సి ఈ నెలలో అమలుతుందని తెలిపారు. అయితే, కేడర్ స్ట్రేంగ్త్
పేరుతో ఉద్యోగులను కుదించే విధానం అధికారులు సరిచేయాలని కోరారు. పీటీడీ
ఉద్యోగులకు పెండింగ్ లో వున్న 3సం.ల సరెండర్ లీవును ప్రభుత్వం వెంటనే విడుదల
చేయాలని, పీటీడీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్సులను జీతంలో కలిపే విధంగా
ప్రభుత్వం అనుమతించాలని కోరారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనట్లయితే ఉద్యమం
తీవ్రతరం చేస్తామని, గతంలో, ప్రభుత్వం విలీనం కకమునుపు ఆర్టీసీ ఉద్యోగులకు
ఉన్న రాయితీలు అన్నీ ప్రభుత్వం విలీనం తర్వాత కూడా కొనసాగించాలని, భవిష్యత్ లో
పిటిడి ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు అన్నీ ప్రభుత్వం నుండి సాధించే భాధ్యత
ఏపీ జేఏసీ అమరావతి తీసుకుంటుందని తెలిపారు. ఈ మహాసభలో మాట్లాడిన ఉద్యోగుల
సంక్షేమం పై ప్రభుత్వ సలహాదారు యన్.చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ
ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన
వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో
చిత్తశుద్ధితో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా
హాజరైన ఆర్టీసి యండి ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను
చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని, 1150కి పైబడి కారుణ్య నియామకాలు ఇప్పటికే
చేపట్టామని, మిగిలిన దరఖాస్తుదారులకు ఆర్టీసి కానిస్టేబుల్, కండక్టర్,
డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలను త్వరలోనే ఇస్తారని తెలిపారు. ప్రజా రవాణా శాఖ
సిబ్బంది మరియు ఉద్యోగులు ప్రజలమన్ననలను పొందే విధంగా పనిచేసి ప్రభుత్వానికి
మంచిపేరు తీసుకునిరావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసి ఉద్యోగులకు రావాల్సిన
అరియర్సులు అన్నీ చెల్లిస్తామని హామీ యిచ్చారు.
పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక : ఈ మహాసభలలో పిటిడి
ఎంప్లాయీస్ యూనియన్ నూతన రాష్ట్ర కమిటీ క్రింది సభ్యులతో ఏకగ్రీవంగా
ఎన్నికయ్యింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఉన్న పలిశెట్టి
దామోదర్ రావు (శ్రీకాకుళం) ను రాష్ట్ర అధ్యక్షుడు గా, రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి గా జీవీ నరసయ్య (కడప), కోశాధికారిగా ఎం ఏ సిద్దిక్ (విజయవాడ),
వర్కింగ్ ప్రెసిడెంట్ గా పి సుబ్రహ్మణ్య రాజు (నెల్లూరు), ఛీఫ్ వైస్
ప్రెసిడెంట్ గా కె. నాగేశ్వరరావు (ఒంగోలు), డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా ఎ.
ప్రభాకర్ యాదవ్ (తిరుపతి), జి.నారాయణరావు( నెల్లూరు), ఎండి ప్రసాద్
(విజయవాడ), పి.భానుమూర్తి (విజయనగరం) ఎన్నికయ్యారు.