విజయవాడ : ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇస్తున్నామని ఎవరికీ కట్టబెట్టడం లేదని
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. లీజు వల్ల ఆర్టీసీకి
అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ఆర్టీసీలో కాల్ సెంటర్ 149 అమల్లోకి
తెచ్చామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీని ద్వారా
ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పొచ్చని, అలాగే ఫిర్యాదులు కూడా చేయవచ్చని
తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఆర్టీసీ ఈయూ 27వ రాష్ట్ర మహాసభలో ఆయన
మాట్లాడారు. ఆదాయం పెరిగితే ఆర్టీసీకి పలు విధాలుగా మేలు జరుగుతోందన్నారు.
ఖర్చులు తగ్గిస్తేనే సంస్థ అప్పులు తీర్చగలమని తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను
లీజుకు ఇస్తున్నామన్న ఎండీ ఎవరికీ కట్టబెట్టడం లేదని స్పష్టం చేశారు. లీజు
వల్ల ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ మహాసభలో పాల్గొన్న అమరావతి
జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతిలో
ఆర్టీసీ కార్మిక సంఘానిది కీలకపాత్ర అని తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు
ఉద్యమాన్ని విరమించేది లేదని తేల్చి చెప్పారు. పోరాటం వల్లే ప్రభుత్వం
విడతలవారీగా సమస్యలు పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులు చేస్తున్న పోరాటాల వల్లే
ఆర్టీసీలో జీతాల పెంపు, కారుణ్య నియామకాలు జరిగాయని తెలిపారు.