విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీనివాస్ మహల్ ఎదురుగా వున్న
షేక్ రాజా సాహెబ్ మినీ జనరల్ ఆసుపత్రిలో రోగులకు చల్లని తాగునీటి సౌకర్యం
ఏర్పాటు చేశారు. సిబ్బందికి తాగునీటి సరఫరా విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్
వాణిశ్రీ ,సిబ్బంది కే బి ఎన్ కళాశాల పాలకవర్గం తో మాట్లాడ్డంతో ఆ సమస్య
తీవ్రతను అర్ధం చేసుకొన్న కళాశాల కార్యదర్శి తునుగుంట్ల శ్రీనివాస్ ప్రతిరోజూ
వారికి తమ ప్రాంగణంనుండి తాగునీరు అందించే ఏర్పాటు చేశారు. కానీ నిత్యం
వందలాది మంది రోగులు పిల్లలు, పెద్దలు, ముఖ్యన్గ గర్భిణీ స్త్రీలు, ఆసుపత్రి
రావడం జరుగుతుంది.అలాంటి తరుణంలో రోగులకు కూడా దాహార్తిని తీర్చే మార్గం
ఆలోచించిన ఎనస్తిషియా డాక్టర్ సాయిరామ్ కూలింగ్ క్యాన్లు విరాళంగా
ఇచ్చారు.కొత్తపేట బ్రాహ్మణ వీధిలోని శిరీష్ మినరల్ వాటర్ యజమాని పోతిన జోగరావు
రోగులకు అవసరమయ్యే కూలింగ్ వాటర్ ఉచితంగా సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు.
బుధవారం ఉదయం నుండి రోగులకు కూలింగ్ వాటర్ సరఫరాని సూపరింటెండెంట్ డాక్టర్
వాణిశ్రీ, డాక్టరు సాయిరామ్ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు.