బాబూ జగ్జీవన్ రామ్ ఆశించిన ఫలితాలు మన జగనన్నతోనే సాధ్యం
ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు : జగనన్న నాయకత్వంలో కుల, మత, జాతి భేదాల్లేవు, అందరికీ సమన్యాయం.
ఇందుకు నేనే నిదర్శనం, దళితులకు ధైర్యం, గిరిజనులకు గుండెచప్పుడు, మైనార్టీలకు
అండ, బలహీనులకు బలం, ఐదు కోట్ల ఆంధ్రుల నమ్మకం, పేద విద్యార్ధుల భవిష్యత్ మన
జగనన్న. మన జగనన్న వచ్చిన తర్వాత విద్యాశాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు.
ఇన్నాళ్ళు ప్రభుత్వ బడులు అభివృద్దికి దూరంగా ఎందుకున్నాయంటే పిల్లలకు ఓట్లు
ఉండవనే కారణం. ఓట్లు కాదు ముఖ్యం మన చిన్నారులకు చదువులు ముఖ్యమని కార్పొరేట్
చదువులను ప్రభుత్వ విద్యాసంస్ధలకు చేర్చిన ఘనత మన జగనన్నది. పిల్లలంతా జగన్
మామయ్య అని ఓన్ చేసుకుంటున్నారు. అంబేద్కర్ ఆలోచనలు, మహాత్మాగాంధీ కలలు,
జ్యోతీరావుపూలే ఆశయాలు, బాబూ జగ్జీవన్ రామ్ ఆశించిన ఫలితాలు మన జగనన్నతోనే
సాధ్యం. ఉన్నతస్ధాయికి వెళ్ళాలంటే విద్య ఒకటే మార్గమని నమ్మిన నాయకుడు మన
జగనన్న. ఇక్కడున్న స్టూడెంట్స్ హిస్టరీ చదివి ఉంటారు హిస్టరీ విని ఉంటారు కానీ
హిస్టరీని క్రియేట్ చేసిన నాయకుడిని ఎప్పుడైనా చూశారా, ఆయన మీ
కళ్ళముందున్నారు..మన జగనన్నే.
దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో పదో తరగతి విద్యార్ధులకు స్టేట్ ర్యాంక్స్
చూశారా, కానీ జగనన్న సహకారంతో ప్రభుత్వ బడులలో చదివిన విద్యార్ధులు స్టేట్
ర్యాంక్స్ సాధించారు. దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా విద్యాశాఖలో సంస్కరణలు
తీసుకొచ్చారు మన జగనన్న. దేశంలో ఎవరూ చేయని విధమైన సంస్కరణలు జరిగాయని గర్వంగా
చెప్పగలం. గతంలో విద్యను వ్యాపారం చేస్తే జగనన్న విద్యను పేదవాడి హక్కుగా
మార్చారు, ఇది చూడలేక ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి. విద్యారంగంలో విప్లవం వస్తే
ఎలా ఉంటుందో దేశానికి చాటి చెప్పారు. చంద్రబాబుకు పేద విద్యార్ధులు చదువుకోవడం
ఇష్టం లేదు. పెద్ద కాలేజీలలో పేదలు చదువుకోకూడదని సీలింగ్ పెట్టి ఫీజులు రూ.
35 వేలు మాత్రమే కట్టి అవి అరకొరగా కట్టేవారు, నాటి బకాయిలు కూడా జగనన్న
కట్టారు. వేల కోట్లు చదువుల గురించి ఖర్చుచేస్తున్నారు. విద్యార్ధులంతా
చదువుకోండి మీకు అండగా ఉంటానన్నారు. దళిత మహిళనైన నన్ను హోంమంత్రిగా పనిచేసే
అవకాశం ఇచ్చారు. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. దళితులకు రాజ్యాధికారం
ఇచ్చి దేశచరిత్రలో నిలబెట్టారు. కొవ్వూరు ప్రజలకు చాలా చేశారు. కొన్ని
సమస్యలు ఉన్నాయి, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డిగ్రీ కాలేజ్ భవన
నిర్మాణానికి అవసరమైన నిధులు కావాలి, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కు
అవసరమైన పంపులు ఇవ్వాలి, నియోజకవర్గానికి మూడు అంబేద్కర్ భవన్స్ ఇవ్వాలి,
కొవ్వాడ కెనాల్ కు అవసరమైన కల్వర్ట్ ఇవ్వాలి, ముస్లిం సోదరులకు ఒక షాదీఖానా
మంజూరు చేయాలని కోరారు.
మీరు మా ఇంటి కొడుకులా ఆదుకున్నారు
దివ్య, బీకాం విద్యార్ధిని, తాళ్ళపూడి మండలం
అన్నా, నా తల్లిదండ్రులిద్దరూ వికలాంగులు, నా తండ్రి అవిటివాడు, తల్లి మూగ,
చెవిటి, మేం ఇద్దరం ఆడపిల్లలం, అమ్మకు, నాన్నకు పెన్షన్ ఇస్తూ నేను ఉన్నాను
అని భరోసానిచ్చారు. నేను కార్పొరేట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాను,
నాఫీజులంతా మీరే చెల్లించారు, వసతి దీవెన కింద అన్నీ ఇచ్చి నన్ను నిలబెట్టారు,
నేను ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను, మీ దయవల్ల ఈ రోజు ఇంగ్లీష్
మీడియంలో చదువుతున్నానంటే మీరే కారణం, మీరు స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు,
మీరు కులం చూడరు, మతం చూడరు, రాజకీయం చూడరు, మా పేదల కోసం వచ్చిన మీరు మా
భవిష్యత్ నిలబెట్టారు, మీరు చేసిన మేలు ఎప్పటికీ మరచిపోలేను, గతంలో అమ్మానాన్న
పెన్షన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవారు కానీ మీరు ఉదయాన్నే వారికి
జీతమిచ్చినట్లు పెన్షన్ ఇస్తున్నారు, రేషన్ బియ్యం కూడా ఇంటికే వస్తున్నాయి,
మీరు మా లాంటి పేదలకు మంచిరోజులు తెచ్చారు, మీరు మా ఇంటి కొడుకులా
ఆదుకున్నారు. నిరుపేదలు ఆనందంగా ఉన్నారంటే కారణం మన జగనన్న, సంక్షేమ పథకాలు
అందుకున్న పేదల దీవెనలు మీకు అండగా ఉంటాయి, మాలాంటి పేదల కోసం పుట్టిన రాజువి,
రారాజువు, తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు, ఈ ఏపీకి మన సీఎం జగనన్న అన్నారు.
మీ నవరత్నాల పథకాల లబ్ధి పొందుతున్నాం
ప్రసన్నకుమార్, బీటెక్ విద్యార్ధి, తాడేపల్లిగూడెం
సార్, నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు, అమ్మ
గృహిణి, నేను జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుడిని, గతంలో కేవలం రూ. 35 వేలు
మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా ఫీజు మొత్తం కూడా ఫీజు
రీఇంబర్స్మెంట్ ద్వారా పొందుతున్నాం. మీరు మోసపూరిత హమీలు ఇవ్వకుండా ఇచ్చిన
ప్రతి హమీ నెరవేర్చిన ఏకైక నాయకుడు మీరు. మీరు ఉన్నత విద్యలో ప్రభావవంతమైన
సంస్కరణలు తీసుకొచ్చారు, నూతన విద్యావిధానానికి సంబంధించిన పాలసీని అమలు
చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. మన విద్యావిధానం అంతర్జాతీయ స్ధాయికి ఎదిగింది,
మీ హయాంలో ఇంజినీరింగ్ ప్లేస్ మెంట్ లో 90 శాతంపైగా సాధిస్తున్నారు, నా కాలేజ్
విద్యార్ధి అమేజాన్ లో రూ. 44 లక్షల ప్యాకేజ్ కి సెలక్ట్ అయ్యాడంటే మీరే
కారణం. మీ నవరత్నాల పథకాల లబ్ధి పొందుతున్నాం, మీరు మాపై ఖర్చుపెట్టిన ప్రతి
రూపాయికి న్యాయం చేసి ఏపీని ముందుకు తీసుకెళతాం, మీ పేరు ఎక్కడ రాయాలన్న చీఫ్
మినిస్టర్ ఆఫ్ ఏపీగా కాకుండా ద పర్మినెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా
రాయాలనుకుంటున్నాం, అటువంటి అవకాశం మీరు కల్పించాలన్నారు.