ఎర్ర చీరా జాకెట్ ధారణతో పూజల్లో పాల్గొన్న వేలాదిమంది మహిళలు
విజయవాడ : శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం ప్రాంగణంలో మంగళవారం
సువాసిని పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు.శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి
పీఠంలో గతనెల 27 నుండి ఈ నెల 3 తేదీ వరకు సహస్ర చండీ యాగాలు జరిగిన విషయం
తెల్సిందే. ఐతే అప్పట్లో అకాల వర్షాలు వల్ల వాయిదా పడిన సువాసిని పూజలు
మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం లోని శ్రీ
రాజరాజేశ్వరి దేవి ఆలయం (దేవి ఆశ్రమం) పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ తేజోమూర్తుల
బాలభాస్కర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని సంప్రదాయం ప్రకారం ఈ వేడుకలకు
మార్గదర్శకత్వం వహించారు. ఈ వేడుకలు కోసం నిర్మించిన ప్రత్యేక వేదికపై శ్రీ
దేవీ కరుమారి అమ్మన్ ప్రతి రూపాన్ని ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై ప్రముఖ
ఆధ్యాత్మిక వేత్త యాబలూరి లోకనాధ్ శర్మ,విమలాదేవి దంపతులు, శ్రీశ్రీశ్రీ
కరుమారి దాసు, తేజోమూర్తుల బాల భాస్కర శర్మ లి ఆశీనులు కాగా వారంతా సువాసిని
లతో తొలుత గురుపూజలు అందుకున్నారు.ఆతరువాత వరసగా శ్రీ దేవి కరుమారి అమ్మన్
పూజ, దంపతులు పూజ,బాల పూజా, కన్యలపూజా, సువాసిని పూజలు నిర్వహించారు. మంగళవారం
జరిగిన ఈ వేడుకలు ఎంతో మంగళ ప్రదమైనదన్నారు.కైలాసంతో ఉమా పూజలు నిర్వహించింత
పుణ్యం సంతరించుకొంటుందన్నారు.ఈ పూజల్లో మాజీ మంత్రి సిద్దా రాఘవరావు సతీమణి
శ్రీమతి లక్ష్మీ పద్మావతి ప్రత్యేకంగా పాల్గొన్నారు. 1008 మంది సువాసిని లను
అమ్మవారి ప్రతిరూపంగా భావించి వారికే పూజలు నిర్వహించారు. అలాగే ప్రతిఒక్కరు
కి చీర జాకెట్ పసుపు కుంకుమ, గాజులు, చలివిడి, ఎండు కొబ్బరి
చిప్ప,పసుపుతాడు,నల్లపూసలు, గంధం చెక్క, ఆకు వక్క అరటిపండు అమ్మవారి
ప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, సీనియర్ గురు స్వామి బెవర
రాము,ఎస్ ఏ ఎస్ కళాశాల కార్యదర్శి రాంపిళ్ల జయప్రకాష్, శ్రీ మాతృ లలితా మండలి
రథసారథి కోడూరి సుందరి,చంద్రకళ, కొండపర్తి పార్వతి, పూజారులు దీక్షితులు,
కొండపర్తి వినోద్, కొండపర్తి చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేలాదిమంది
భక్తులకు అన్నదానం చేశారు.