విజయవాడ : టీడీపీ అరాచక పాలనలో ప్రజలకు అండగా నిలిచి ప్రజాసంకల్ప పాదయాత్రలో
భవితపై భరోసా కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి
బ్రహ్మరథం పట్టి నవశకాన్ని ఆవిష్కరించి నేటికి నాలుగేళ్లు పూర్తయిందని
వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 26 న
అమరావతిలో నిరుపేద మహిళలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్ళు పట్టాలు ఇచ్చే కార్యక్రమం
చేపట్టామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారం లో కి వచ్చి
నేటికీ నాలుగేళ్లయిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డికి
శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైసిపి నాయకులు ఆకుల శ్రీనివాస్ నాయకత్వంలో కేక్
కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల
శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కు సంక్షేమ పథకాలు
రాజ్యాధికారంలో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటకే వాటా ఇచ్చి సామాజిక
మహావిప్లవాన్ని ఆవిష్కరించారు అని చెప్పారు. విప్లవాత్మక సంస్కరణల ద్వారా
సుపరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన జనరంజక పాలనకు
పునాదిపడి కూడా నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయి ఐదవ వసంతంలోకి అడిగు
పెట్టడం జరిగిందని చెప్పారు. 2024 లో వైసీపీ అధికారం లో కి తీసుకురావడం ఖాయం
అని చెప్పారు. గత తెలుగుదేశం పరిపాలనకు చరమ్మ గీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని
ప్రజలు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అర్హులైన ప్రజలందరికీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారని
పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పూర్ణచంద్రరావు , మురళి ,
చంటిబాబు , పర్వేజ్ , చిన్న , మధు పలువురు నాయకులు పాల్గొన్నారు.