బహిరంగ లేఖ
విజయవాడ : దళిత గిరిజనుల సంక్షేమం అభివృద్ధి రక్షణ పై ఈ రాష్ట్ర ప్రభుత్వం
గాలికి వదిలేసిందని వారి పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఏపీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తీవ్రంగా ఆరోపించారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్
లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం
ఎంతో ఆర్భాటంగా నవరత్నాలు కాకుండా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ బద్ధంగా అమలు
కావలసిన ప్రత్యేక సంక్షేమం అభివృద్ధి పథకాలపై ఈ ప్రభుత్వం బడ్జెట్లో
కేటాయింపులు దళిత గిరిజన సాధించిన ప్రగతిపై ఈ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల
చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాసిన బహిరంగ లేఖలో గిడుగు రుద్రరాజు డిమాండ్
చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ ఎస్టీలకు సంక్రమించిన ప్రత్యేక హక్కులు
చట్టాల పట్ల అనుసరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ
విషయం కాంగ్రెస్ పార్టీతో ఇతర అన్ని పార్టీలతో కలిసి దళిత గిరిజన ప్రజాసంఘాలు
ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకువచ్చిన బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడానికి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది ఎస్సీ ఎస్టీల విషయంలో
ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తే సహించేదిలేదని ఆయన ఈ సందర్భంగా
ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షురాలు
సుంకర పద్మశ్రీ , కొరివి వినయ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా
కిరణ్, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మదాన మోహన్ రెడ్డి, హరికుమార్
రాజు, మీసాల రాజేశ్వరరావు, కాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.