శంకుస్థాపనకు సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పర్యటనకు
వస్తున్న సందర్భంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మాజీ మంత్రి, స్థానిక
శాసనసభ్యులు. పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. ఆదివారం ఆయన
ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో – ఆర్డినేటర్, శాసన మండల సభ్యులు తలశిల రఘురాం,
జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, వివిధ శాఖల తదితరులతో కలిసి సీఎం పర్యటించే
ప్రాంతాలను పరిశీలించారు.
తొలుత స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలోని స్విమ్మింగ్ పూల్ పక్కన గల
జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ శిబిర మైదానం వద్ద ఏర్పాటు చేస్తున్న
బహిరంగ సభ ప్రాంగణాన్ని ఈ బృందం పరిశీలించింది. బహిరంగ సభ వేదిక ఎదురుగా
ఏర్పాటు చేసిన డి సర్కిల్ లో మామిడి తోరణాలు అరటి పిలకలతో సాంప్రదాయంగా
అలంకరించాలని హార్టికల్చర్ అధికారులకు ఆదేశించారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా సభాస్థలి పక్కనగల చిన్న వేదిక వేదిక
ఏర్పాటు, విఐపి, మీడియా గ్యాలరీ, ఫోటో గ్యాలరీ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్ల
తీరును ఈ బృందం పర్యవేక్షించింది. అనంతరం తపసిపూడిలోని ముఖ్యమంత్రి తాడేపల్లి
నుంచి నేరుగా దిగి హెలిప్యాడ్, తర్వాత పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే
స్థలం, ముఖ్యమంత్రి సముద్ర హారతి ఇచ్చే వేళ సముద్ర తీరంలో 50 పడవలను ఎదురుగా
అర్థ చంద్రాకారంలో లంగరు వేసి నిలబెట్టేందుకు చేసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే
పేర్ని నాని అధికారులను ఆరా తీశారు. ముఖ్యమంత్రి సముద్ర హారతి అనంతరం
సముద్రునికి పట్టు వస్త్రాలను, పసుపు కుంకుమలు సముద్రపు నీటిలో వదిలేటప్పుడు
సీఎం దుస్తులపై పసుపు కుంకుమలు గాలికి వచ్చి పడకుండా ఉండేందుకు సరుగూడు బాదుల
వేదిక కర్రల రెయిలింగ్ పై తెల్లని వస్త్రాన్ని చుట్టాలని ఆయన సూచించారు. అలాగే
హోమగుండం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని పోర్టు అధికారులు అడిగారు. అనంతరం
పైలాన్ నిర్మాణ తుది మెరుగులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ తలసిల రఘురాం
మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు
చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే కార్యక్రమాలను
జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా
ప్రజలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత జిల్లా
కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పోర్టు శంకుస్థాపన పనులు
చేస్తున్న శుభ సందర్భంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ట్రాఫిక్ ఎటువంటి అవరోధాలు కలగకుండా
పోలీసులు చక్కని పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా
పోలీసు రెవెన్యూ తదితర శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్
సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్, జిల్లా ఎస్పీ
పి. జాషువా, మచిలీపట్నం పోర్ట్ ఎండి విద్యాశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్
సలార్ దాదా, మచిలీపట్నం మాజీ జెడ్పిటిసి లంకె వెంకటేశ్వరరావు(ఎల్వీయార్)
అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, ఆర్డీవో ఐ. కిషోర్, తహసిల్దార్
సునీల్ బాబు, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్య, యువజన నాయకుడు పేర్ని కృష్ణమూర్తి (
కిట్టు ), పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, పలువురు అధికారులు
సిబ్బంది పాల్గొన్నారు.