ప్రభుత్వం నుండి స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చేవరకు ఉద్యమం
ఏపిజేఏసి అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు
విజయవాడ : ఏపియస్ ఆర్టీసీ ఏర్పడక ముందే నిజాం ప్రభుత్వం నుండి రవాణారంగంలోనే
మొట్టమొదటి కార్మికసంఘంగా ఏఐటియుసి అనుబంధ సంఘంగా ఏర్పడిన ఆర్టీసీ ఎంప్లాయిస్
యూనియన్ కు 71 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం
చేసిన అనంతరం ఏపిపిటిడి ఎంప్లాయిస్ యూనియన్ గా అవతరించి ఏపిజెఏసి అమరావతి కి
అనుబంద సంఘంగా కొనసాగుతున్న ఈ సంఘం 27 వ రాష్ట్ర మహాసభలు కృష్ణా జిల్లాలో
ఈనెల 24 న నిడమానూరు పోరంకి రోడ్డుకు ఆనుకొని ఉన్న మురళీరిసార్ట్సు లో భారీ
సంఖ్యలో ఉద్యోగుల సమీకరణతో జరుగుతున్న ఈ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుండి
పిటిడి (ఆర్టీసి)ఉద్యోగులంతా హాజరై విజయవంత చేయాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్
రాష్ట్రప్రధానకార్యదర్శి, ఏపిజెఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి
దామోదరరావు ఆదివారం రెవిన్యూభవన్ లో మహాసభలు పోస్టర్ రీలీజ్ చేస్తూ మహాసభలను
విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర మంత్రులు,
ఆర్టీసి చైర్మన్, ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్, టిఆర్& బి సెక్రటరీ,
బొప్పరాజు, ఏఐటియిసి నాయకులు, వైస్ చైర్మన్, విజయవాడ జోనల్ చైర్ పర్సన్,
గన్నవరం శాసన సభ్యులు, ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తదితరులు
హాజరవుతారని తెలిపారు.
ఈ మహాసభలో ఆర్టీసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్ ప్రణాళికలు
పైన, అలాగే నూతన రాష్ట్రకమిటి ఎంపిక చేయడం జరుగుతుందని బొప్పరాజు &
దామోదరరావు తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యo
బకాయిపడ్డ నాలుగు డి ఎ లు, పిఆర్సి ఆరియర్స్, పే స్కేల్స్, స్పెషల్ పే లపై
ప్రభుత్వం నుండి స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.
ఏపిలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు & ఔట్
సోర్శింగు ఉద్యోగుల సమస్యలపై నిజాయితీగా ఉద్యోగుల పక్షాన గత 73 రోజులుగా ఏపీ
జేఏసి అమరావతి ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం స్పందించి కొన్ని
సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుండి
చెప్తున్నట్లుగా ఏపీజేఏసి అమరావతి రాష్ట్రకమిటి ఆధ్వర్యంలో పిభ్రవరి 13 న
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో
పొందుపరచిన ప్రధానంగా బకాయిపడ్డ నాలుగు డి ఎ లు, పీఆర్సీ ఆరియర్స్, పే
స్కేల్స్, స్పెషల్ పేలు, వి ఆర్ ఏ లకు డి ఏ, పదోన్నతి పొందిన గ్రేడ్-II వి ఆర్
ఓ లకు పే స్కేల్ ఇవ్వడం, విలీనానికి ముందు అర్టిసి లో పనిచేస్తున్న
ఉద్యోగులకు పాత సర్వీస్ రూల్స్ వర్తింప చేయడం, హోం గార్డ్స్ ను ఇతర యూనిఫాం
సర్వీస్ శాఖలలో విలీనం చేయడం, మిగిలి పోయిన తొమ్మిది వందల బాషా పండితుల కొరకు
సూపర్ న్యూమరరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు, గ్రామ వార్డ్ సచివాలయం
ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సమస్యలు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల పేరు ఇంజనీర్
సబార్డినేట్ గా మార్చి 010 పద్దు కింద జీతాలు, డిఆర్డిఎ ఉద్యోగులను పీఆర్ అండ్
ఆర్డి శాఖలో విలీనం చేయడం, మునిసిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, రూరల్ వాటర్
సప్లై డిపార్ట్మెంట్ లోని ఇంజనీర్లకు డిఈ పోస్టులు మంజూరు తదితర ముఖ్య అంశాల
అన్నింటిపైనా స్పష్టమైన లిఖితపూర్వక ఉత్తర్వులు వస్తేనే తప్ప ఈ ఉద్యమం ఆగేది
లేదని ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్
పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించినప్పటికీ,
ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింనందున, తప్పని పరిస్థితుల్లో
ఏపిజెఏసి అమరావతి గత 73 రోజులుగా ఉద్యమాన్ని చేస్తున్నామని, ఈ ఉద్యమ ఫలితమే .
ఉద్యమ కాలంలో సి యస్ కి సమర్పించిన లేఖలోని కొన్ని ముఖ్యమైన అనగా ఉద్యోగులకు
జిపియఫ్ & ఏ పి జి యల్ ఐ కు సంబందించి మనం దాచుకున్న, ప్రభుత్వం వాడుకున్న
డబ్బులు షుమారు రూః3,500 కోట్లు, సిపియస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్సన్
ఫంఢ్ రూ.2,450 కోట్లు,పొలీసులకు గతంలో ఉన్న టిఏ లు నేడు 550 కోట్ల సరెండర్
లీవులు, ఆర్టీసి ఉద్యోగులకు ఓటి డ్యూటీ డబ్బులు, అన్నీ శాఖల్లో కారుణ్య
నియామకాలు, కొత్త జిల్లాల హాడ్క్వార్టర్స్ లో 16% హెచ్.ఆర్.ఏ.16% అమలు, గ్రామ
వార్డ్ సచివాలయం ఉద్యోగుల కు టార్గెట్లు ఎత్తివేత, కాంట్రాక్ట్ ఉద్యోగుల డేటా
సేకరణ ఉత్తర్వులు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ బలోపేతానికి నేరుగా ఉద్యోగి నుండి
ట్రస్ట్ కు డబ్బులు పంపడం, సమగ్ర శిక్ష లో పనిచేసే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్
సమస్యల పరిష్కారానికి ఉత్తర్వులు తెచ్చుకొగలిగామని, కనుక ఈ విషయాన్ని ప్రతి
ఒక్క ఉద్యోగి ఉపాధ్యాయుడు కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్
ఉద్యోగులు గమనించాలని, ఇంకా ప్రదానమైనటువంటి పీఆర్శీ /డిఏ అరియర్సు,అఫ్ గ్రేడ్
చేసిన స్కేల్సు, స్పెషల్ పే లు అమలు చేసేంతవరకు ఉద్యమం కొనసాగి తీరుతుందని
తెలిపారు.
మూడవ ప్రాంతీయ సదస్సు:
ఈనెల 27 న ఏలూరులో జరుగుతున్న మూడవ ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని
ఉద్యోగులకోసం నిజయాతీగా జరుగుతున్ణ ఈ ధర్మ పోరాటంలో ఉద్యోగులంతా స్వచ్చందంగా
పాల్గొనాలని, ఈ ప్రాంతీయ సదస్సు ను జయప్రదం చేసి పెండింగు ఉన్న ప్రధానమైన
సమస్యలు సాధనకు దోహద పడాలని బొప్పరాజు,దామోదరరావు అందరూ ఉద్యోగులకు
పిలుపునిచ్చారు.