కొవ్వూరు : ఈ నెల 24న జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేలా కొవ్వూరు
నియోజకవర్గం స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు హోంమంత్రి
తానేటి వనిత దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో శనివారం
హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో కొవ్వూరు టౌన్, చాగల్లు మండలాల నాయకులతో
హోంమంత్రి తానేటి వనిత సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారిగా సమీక్ష
నిర్వహిస్తూ నాయకులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం
చేయడానికి అందరూ సమిష్టి కృషితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి
పర్యటన, రోడ్ షో, సభ ఏర్పాట్లపై నాయకుల నుండి సూచనలు, అభిప్రాయాలను
సేకరించారు. ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్
జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గానికి తొలిసారి వస్తున్నారు కాబట్టి భారీ
స్వాగత ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే జనాలను సభా
ప్రాంగణానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని గ్రామాల వారీగా నాయకులు బాధ్యతలు
కేటాయించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ
ముందుకు సాగాలన్నారు. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని
వివరించారు. వేసవికాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా తగు రక్షణ ఏర్పాట్లు జాగ్రత్తలు
తీసుకోవాలని హోం మంత్రి సూచించారు.