కృష్ణారావు
విజయవాడ : ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, భారత స్వతంత్ర సమరయోధుడు,
సుప్రసిద్ధ జాతీయ ప్రజా నాయకుడు, ప్రకాశం బ్యారేజీ నిర్మాణ కర్త ఆంధ్ర కేసరి
టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి సందర్భంగా శనివారం విజయవాడ ప్రకాశం
బ్యారేజీ మీద ఉన్న ప్రకాశం పంతులు గారి విగ్రహానికి జలవనురుల రంగ నిపుణులు,
సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట
గోపాలకృష్ణారావు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ
వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ
సామాన్య కుటుంబంలో జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు
రాష్ట్రం నుంచి తెలుగువారిని వేరుచేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి
ఆజ్యుడయ్యారని స్వాతంత్రానికి ముందు సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు
తమిళులు గజగజ వణికి పోతుంటే లక్షలాదిమందికి ధైర్యం చెప్పి సైమన్ గో బ్యాక్ అని
గర్జించారని అప్పుడే పోలీసులు ప్రకాశం గుండెలపై తుపాకీ పెట్టి కాల్చడానికి
ప్రయత్నించగా తూటాకు తన గుండెను చూపించిన ధీశాలిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయినప్పుడు తొలి
ముఖ్యమంత్రిగా 13 నెలలు అతి తక్కువ సమయంలో పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో
ముఖ్యమంత్రి హోదాలో 1954 ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి ప్రకాశం
పంతులు శంకుస్థాపన చేశారని, 13 నీటిపారుదుల ప్రాజెక్టులు చేపట్టి రికార్డు
స్థాపించారు అన్నారు. ప్రస్తుతం కృష్ణ డెల్టాలోని కృష్ణ ,గుంటూరు, ప్రకాశం,
పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు 13 లక్షల ఎకరాల్లో ఏటా మాగాణి సాగు చేసేందుకు
ప్రకాశం బ్యారేజీ వరదాయినిగా మారింది అన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలోని
జలవనరుల శాఖలో పనిచేసే యువ ఇంజనీర్లందరూ క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి ఆంధ్ర
ప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.