రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వై. వీ. బీ రాజేంద్రప్రసాద్.
గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన 8660 కొట్ల రూపాయల నిధులను
వెంటనే మా ఖాతాల్లో జమ చేయాలి : లక్ష్మీ ముత్యాలరావు.
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం,
ఉమ్మడి విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో (విజయనగరం ఫంక్షన్ హాల్,
దాసన్నపేట రైతుబజార్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా సర్పంచ్ ల
సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని సర్పంచుల సమస్యలపై వై.వీ.బీ.
రాజేంద్రప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావు ప్రసంగించారు. ఈ సమావేశంలో రాజేంద్ర
ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల సర్పంచులు ఎవ్వరు
పంచాయతీల కరెంట్ బిల్లులు కట్టవద్దని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ
అభివృద్ధికి 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా పంచాయతీలకి పంపించిన రూ. 8660
కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి తన సొంత అవసరాలకు వాడివేసుకుందని,
అదేమంటే ఆ డబ్బులు కరెంటు బకాయిల కింద జమ చేసుకున్నామని చెబుతూనే, మరలా కరెంట్
బిల్లులు కట్టమని సర్పంచ్ల పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు.
అయినా అసలు గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు ఉచిత విద్యుత్ ను ఇచ్చారని, ఈ
ప్రభుత్వం దానిని విస్మరిస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ పంచాయతీలకు కేంద్రం
పంపిన నిధులు అన్నీ కూడా దారి మళ్లించి వేసిందని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 8660 కోట్లను వెంటనే మా పంచాయతీల
ఖాతాల్లో జమ చేయాలని, అలాగే గ్రామపంచాయతీల ఖాతాల్లో ఉన్న అన్ని రకాల నిధులను
కరెంటు బిల్లుల క్రింద జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే
ఉపసంహరించుకోవాలని, దీనిని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర
సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్ష్మీ
ముత్యాలరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో మా సర్పంచులను
అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని, కేంద్రం పంపిన ఆర్థిక సంఘం నిధులు దారి
మళ్లించి తన సొంత అవసరాలకు వాడుతుందని, వెంటనే ఆ నిధులను మా గ్రామ పంచాయతీల
ఖాతాల్లో జమ చేయకుంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం యొక్క డిమాండ్లు అయిన సర్పంచుల నిధులు ,విధులు,
అధికారాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం 14 ,15వ ఆర్థిక సంఘం ద్వారా 12,918
గ్రామాల సర్పంచులకు పంపిన రూ.8660 కోట్ల రూపాయలు తిరిగి సర్పంచుల పీ ఎఫ్ ఎం
ఎస్ ఖాతాల్లో జమ చెయ్యాలని, గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను సర్పంచుల
ఆధ్వర్యంలోకి తీసుకురావాలని, సర్పంచులకు , ఎంపీటీసీ లకు రూ.15 వేలు, అలాగే
ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ. 30వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీ
నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని, పాత పద్ధతిలోనే పంచాయతీలకు
ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. గత మూడు న్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం
నిలిపివేసిన గ్రామ పంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇలా
న్యాయబద్ధమైన మా 13 డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని
సర్పంచులందరినీ కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర
ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, రాష్ట్ర ఉాధ్యక్షులు అనెపు
రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు గేదెల రాజారావు, కర్రోతు సత్యనారాయణ, తుంపల్లి
రమణ,రాష్ట్ర కార్యదర్శి వానపల్లి ముత్యాలరావు , చిత్తూరు జిల్లా చుక్కా
అద్యక్షులు ధనుంజయ యాదవ్, రాష్ట్ర ఉాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బారామయ్య ,
గౌరవ సలహాదారు వీరభద్ర ఆచారి సర్పంచుల సంఘం నాయకులు సోము నాయుడు, మజ్జి
రాంబాబు తదితరులు పాల్గొన్నారు