డివిజన్ లో నూతన వాటర్ ట్యాంకు కడుతున్నాం
మోడల్ డివిజన్ గా అభివృద్ది చేస్తాం
ప్రతి ఒక్కరూ కూడా త్రిబుల్ అర్ కార్యక్రమాన్ని వినియోగించాలి
వ్యర్ధాలను రోడ్డు మీద పడేయద్దు
మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ : స్థానిక 46 వ డివిజన్ లో శనివారం మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ
శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించి డివిజన్ లో
జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం
నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న త్రిబుల్ అర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ సుమారు 10కోట్ల రూపాయల అభివృద్ది పనులు
చేస్తున్నామన్నారు.కె ఎల్ రావు పార్క్ ను అభివృద్ది చేస్తున్నామని
తెలిపారు.రోడ్లు అభివృద్ది చేస్తున్నామన్నారు. డివిజన్ లో జరుగుతున్న పనులను
పరిశీలించరన్నారు.డివిజన్ లో నూతన వాటర్ ట్యాంకు నిర్మించబోతున్నట్లు
తెలిపారు.అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ డివిజన్ ను మోడల్ డివిజన్
గా అభివృద్ది చేస్తామని అన్నారు.దేశంలో నే మన విజయవాడ నగరనికి మంచి ర్యాంకు
వచ్చిందన్నారు.ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నా అధికారులకు అభినందనలు
తెలిపారు.ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రిబుల్ కార్యక్రమాన్ని వినియోగించాలని
పిలుపునిచ్చారు.వ్యర్ధాలను రోడ్డు మీద పడేయద్దు విజ్ఞప్తి చేశారు.ఇళ్లలలో
పనికి రాని వస్తువులను తృబుల్ అర్ సెంటర్ లో ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి
చేశారు.ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నరేంద్ర, వెన్నం రజిని కుమార్, దుర్గ గుడి
చైర్మన్ కర్నాటి రాంబాబు, దేవత్ మురళి నాయక్,అదిల్,మజ్జి శ్రీను,ట్రాక్టర్
రాము,డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.