అట్టహాసంగా వరుసగా మూడో ఏడాదివాలంటీర్లకు వందనం కార్యక్రమం
వాలంటీర్ లకు వందనం కార్యక్రమం లో భాగంగా జిల్లాలో సేవా వజ్ర, సేవా రత్న,సేవా
మిత్ర క్రింద మొత్తం 8408 మంది వాలంటీర్ లకు నగదు పురస్కారం
సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన నుండి పుట్టినవే
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూ గర్భ వనరుల శాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు : సేవాతత్పరతతో పని చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణ స్వామి తెలిపారు.
శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విజయవాడ కన్వెన్షన్
సెంటర్ లో ఏర్పాటు చేసిన వాలంటీర్లుకు వందనం కార్యక్రమంను లాంఛనంగా
ప్రారంభించగా వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి
కార్యక్రమం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నుండి వీక్షించే ఏర్పాటు చేసారు. ఈ
సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ సేవాతత్పరతతో పని చేస్తున్న వాలంటీర్
వ్యవస్థ దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందించే అన్ని
సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరవేయడంలో వాలంటీర్లు ప్రముఖ పాత్ర
పోషిస్తున్నారన్నారు.
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ వనరుల శాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల
వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన నుండి పుట్టినవేనని, భారతదేశంలోని అన్ని
రాష్ట్రాలు ఈ వ్యవస్థల ద్వారా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాను అమలు చేస్తున్న
తీరును గొప్పగా కొనియాడుతున్నాయని తెలిపారు. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ను
నియమించి కుల, మత, ప్రాంతాలకతీతంగా సంక్షేమ ఫలాలను అందించిన ఘనత మన
ముఖ్యమంత్రికే దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు
అందించడంలో ఉత్తమ ప్రతిభ కనపరచిన వారిని గుర్తించి ప్రతి ఏటా సేవామిత్ర,
సేవావజ్ర, సేవారత్న బిరుదాలతో పాటు సేవావజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20
వేలు, సేవామిత్రకు రూ.10 వేలు నగదు పురస్కారంతో ఇస్తూ వారిని సన్మానించడం
జరుగుతున్నదని తెలిపారు. అర్హులకు లబ్ధిని చేకూర్చడం లో వీరు చేసిన సేవలను
గుర్తించి ప్రభుత్వం వీరిని ఘనంగా సన్మానించడం జరుగుతున్నదని తెలిపారు.
కారుణ్య నియామకాల క్రింద వివిధ ప్రభుత్వ విభాగాలలో వంద మందికి నియామక పత్రాలను
అందజేయడం సంతోషమని, గత మాసంలో కుప్పం నియోజకవర్గంలో 42 మందికి ఇది వరకే
కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
అభివృద్ధి సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరింత పటిష్టంగా
అమలవుతున్నదని తెలిపారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలకు అర్హులుగా
లబ్దిపొందుతున్న వారి సంతృప్తే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. సామాజిక
పెన్షన్ లు అందించడంతో పాటు ప్రభుత్వం నిర్వహించిన పలు సర్వేలు, ఈ – కెవైసి
వంటి వివిధ ప్రభుత్వ పథకాల లబ్ది గురించి లబ్దిదారులకు వివరిస్తూ వారికి
పథకాలను చేరువ చేయడంలో ప్రధాన భూమిక పోస్తున్నారని, ఇలాంటి మంచి పనికి
తోడ్పడుతున్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం తరఫున అభినందనలు
తెలిపారు.
చిత్తూరు ఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వాలంటీర్లు అందిస్తున్న
సేవలకు గుర్తుగా వారిని సత్కరించడంలో భాగంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని
అట్టహాసంగా ప్రారంభించి నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వాలంటీర్లు
అందిస్తున్న సేవలకు వారి ఋణం తీర్చుకోలేనిదని, వీరిని రాష్ట్రానికి
పట్టుకొమ్మలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి భావించి ఉత్తమ
సేవలందించిన వాలంటీర్లకు నగదు పురస్కారంతో పాటు సేవామిత్ర, సేవావజ్ర, సేవారత్న
బిరుదులను ప్రకటించడం జరుగుతున్నదని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం ద్వారా
వాలంటీర్ వ్యవస్థ బలపడుతుందని తెలిపారు. ప్రజల వద్దకే పాలన అందించాలనే
ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రిగా తను పదవీ భాధ్యతలు స్వీకరించిన మూడు నెలలకే సచివాలయ
వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50
ఇండ్లకు ఒక వాలంటీర్ ను నియమించారని, వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన
లబ్దిదారులకు అందించి, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు
చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లు మొదటి రోజునే
దాదాపుగా 90 శాతం పంపిణీ చేసిన ఘనత వాలంటీర్లదే అని కొనియాడారు. చిత్తూరు నగర
మేయర్ అముద మాట్లాడుతూ వాలంటీర్లకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం,
రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది
చేకూర్చేందుకు నిస్వార్థంగా పని చేయడం సంతోషమని, జగనన్న సారథులుగా వీరిని
కొనియాడారు.
ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు
పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డప్ప, ఎం ఎల్ సి భరత్, డి ఆర్ ఓ ఎన్.రాజశేఖర్,
జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, డిసిసీబీ చైర్మన్ రెడ్డెమ్మ, రాష్ట్ర జానపద
కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పలమనేరు – కుప్పం –
మదనపల్లె అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, జడ్పీ
మహిళా స్థాయి సంఘ చైర్మన్ భారతి, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, నగర కమీషనర్
అరుణ, మెప్మా పిడి రాధమ్మ, ఆర్ టిసి ఆర్ ఎం జితేంద్రనాధ్ రెడ్డి, జిల్లా
మైనారిటీ వెల్ఫేర్ అధికారి చిన్నారెడ్డి, డి పి ఆర్ సి జిల్లా కో ఆర్డినేటర్
షణ్ముగ రాం, చిత్తూరు పలమనేరు డి ఎల్ డి ఓ లు రవి కుమార్, ఉమావాణి, ట్రైనీ
డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, సంబంధిత అధికారులు, నాయకులు పెద్దిరెడ్డి, ఎం ఆర్
సి రెడ్డి, కృష్ణ మూర్తి, పెద్ద ఎత్తున వాలంటీర్లు పాల్గొన్నారు