పేదల ఇళ్ల స్థలాలపై వ్యాఖ్యలు బాబు అహంకారానికి నిదర్శనం * పేదలు చంద్రబాబుకు
రాజకీయంగా సమాధి కట్టాలి * పేదల ఇళ్లను సమాధులన్న బాబును ప్రజలు నిలదీయాలి *
మంత్రి మేరుగు నాగార్జున
గుంటూరు : పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు సమాధులు కట్టుకోవడానికి మాత్రమే
పనికొస్తాయని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన కండకావరానికి, దురహంకారానికి
నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున. ధ్వజమెత్తారు.
పేదల ఇళ్లను సమాధులన్న చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయాలని, చంద్రబాబును
రాజకీయంగా సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన
మీడియా ప్రతినిధుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,
మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలు కట్టుకుంటున్న ఇళ్లు చంద్రబాబుకు సమాధుల్లా
కనిపిస్తున్నాయా?అని నిలదీసారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 సెంట్ల చొప్పున
స్థలాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు తన హయాంలో ఎంత మంది పేదలకు
ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. టీడీపీ అధికారంలో ఉన్న
సమయంలో 2017 దాకా కూడా పేదలు తాము ఉంటున్న ప్రైవేటు స్థలాల్లో ఇళ్లు
కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం కుల,మతాలను
చూడకుండా ఎవరి పట్ల ఏ వివక్షా లేకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాడికీ ఇళ్లను
ఇచ్చిందని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వనంత భారీ స్థాయిలో ఒకేసారి 30
లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి
చెప్పారు.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా పేదల వ్యతిరేకి అని
చెప్పారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి, గిరిజన వ్యతిరేకి,బీసీల వ్యతిరేకి,
మైనార్టీల వ్యతిరేకి, పేద ప్రజల ద్రోహి అని దుయ్యబట్టారు. పెద్దల్ని కొట్టి
పేదలకు పెట్టడం రాబిన్ హుడ్ లాంటి వాళ్ల నైజమైతే, పేదలను కొట్టి పెద్దలకు
పెట్టడం చంద్రబాబు నైజమని నాగార్జున ఆరోపించారు. అమరావతి ఇళ్ల పట్టాల విషయంలో
చంద్రబాబు ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టులతో
మొట్టికాయలు వేయించుకున్నా చంద్రబాబు పెత్తందారీ, ఫ్యూడల్ భావజాలంలో మార్పు
రాలేదన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, మేము
పేదల పక్షం అని గుండెల మీద చేయివేసుకొని చెబుతున్నారని. అదే చంద్రబాబుకు
ధైర్యం ఉంటే తాను పెత్తందారుల పక్షం అని ఒప్పుకోవాలని అని నాగార్జున సవాల్
విసిరారు. పేదల ద్రోహి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పేదలను ఉద్ధరించి
కోటీశ్వరులను చేస్తారంటే నమ్మడానికి ప్రజలు వెర్రివాళ్లు కాదని
అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును నమ్మితే దళితులు, బీసీలు, పేదలు బతికే పరిస్థితే ఉండదని
ఆరోపించారు. అట్టడుగు వర్గాలకు ఇంతగా ద్రోహం చేస్తున్న చంద్రబాబును పేదలు,
అణగారిన వర్గాల వారందరూ తమ వర్గ శత్రువుగా భావించి రాజకీయంగా సమాధి కట్టాలని
నాగార్జున కోరారు. పేదలు ఇళ్లు కట్టుకుంటే వాటిని స్మశానాలు, సమాధులుగా
పేర్కొన్న చంద్రబాబును పేద ప్రజలందరూ ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
పేదల ఇళ్ల స్థలాలపై పెందుర్తిలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని
డిమాండ్ చేసారు. రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికులకు, ఇతర ప్రాంతాలకు వలస
పోయి జీవిస్తున్న వారికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరుగుతోందని స్పష్టం చేసారు.
నారా లోకేష్ ను ఓడించడానికే రాజధాని ప్రాంతంలో పట్టాలు ఇస్తున్నారన్న టీడీపీ
విమర్శలను విలేకరులు ప్రస్తావించగా ఎన్నడూ ఏ ఎన్నికలోనూ గెలవని లోకేష్ ను
ఓడించడానికి కుట్రులు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు.