అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
హోం మంత్రి తానేటి వనిత
రాజమహేంద్రవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ ఈ నెల 24 వ తేదీ బుధవారం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం
జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత
ఆధ్వర్యంలో ఎంఎల్సీ సీయం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ , జిల్లా
కలెక్టరు డా. కె. మాధవీలత, ఎస్పీ సి హెచ్.సుధీర్ కుమార్, మున్సిపల్ కమీషనర్
కే. దినేష్ కుమార్ ల తో కలసి సిఎం పర్యటన పై ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో
సమీక్షించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ మే 24వ తేదీ
బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు పట్టణంలో పర్యటన నేపథ్యంలో
అధికారులు తమ కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించి , అనుబంధ శాఖలు
సమన్వయంతో పనిచేసి సిఎం పర్యటన విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి సంఘటనలు
జరగకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ విధులు
నిర్వహించాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అందుకు తగిన విధంగా ముందస్తు
ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న దృష్ట్యా హాజరయ్యే అధికారులు
అప్రమత్తతో వారికి కేటాయించిన విధులు సజావుగా నిర్వహించాలన్నారు.
సిఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎం ఎల్ సి తలశిల రఘురాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి
పర్యటనకు సంబంధించి కొవ్వూరు పట్టణంలో సభా వేదిక, హెలిపాడ్ కు సంబంధించిన,
వాహనాలు పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఎంపీ
మార్గాని భరత్ రామ్ ల మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ఎండ తీవ్రతను దృష్టిలో
ఉంచుకొని ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా
అధికారులు అందుకు తగిన విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం
పర్యటనకు ముందు రోజే అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాలను క్షుణ్ణంగా
పరిశీలించాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఈ నెల 24 న
కొవ్వూరు పట్టణంలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారన్నారు. సమయం తక్కువుగా ఉన్నందున
అధికారులు వారికి కేటాయించిన విధులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 5 పర్యాయాలు
పర్యటించారని పేర్కొన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా ఎటువంటి తప్పిదాలకు తావు
లేకుండా టీం వర్క్ గా పని చేస్తూ ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయం
చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో హెలీప్యాడ్ నుండి సభా వేధిక వరకు రోడ్ షో
కు సంబందిత ఏర్పాట్లు ఆర్ ఎం సి మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్
పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్యాలరీలకు సంబందించి వాటర్ ప్యాకెట్స్,
అల్పాహారం, మెడికల్ క్యాంపులు ద్వారా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం
చేసుకోవాలన్నారు. బహిరంగ సభకు వొచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా
కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్పీ సిహెచ్. సుధీర్
కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిఎం పర్యటనకు సంబందించిన హెలీప్యాడ్, రోడ్ షో,
సభావేదిక వద్ద కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు తో పాటు
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు నిర్వహిస్తామన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులకు పార్కింగ్ సౌకర్యం కోసం
స్థలాలు గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్
మాట్లాడుతూ సిఎం రోడ్ షోకు సంబందించి బారిగేడ్స్ ఏర్పాటు, ప్రజలకు తాగునీరు,
సమావేశాలు అల్పాహారం అందిస్తామని, సభావేధిక వద్ద ప్రతి గ్యాలరీలో మెడికల్
కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందిస్తామన్నారు. ఈ సమావేశంలో యంపి మార్గాని భరత్
రామ్, డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి,
డి ఎమ్ హెచ్ ఓ ద. కే. వెంకటేశ్వరరావు, డీసీహెచ్ ఓ డా. సనత్ కుమారి, డీపీవో పి.
జగదాంబ, డీఆర్డీఏ పీడీ సుభాషిని, డిఎల్డీవో పి. వీణాదేవి, పీడీ డ్వామా జిఎస్.
రామగోపాల్, ఆర్డబ్ల్యూఎస్. ఎస్ఈ భాలశంకర్, పంచాయతీరాజ్ ఎస్ ఈ ఏబీవీ ప్రసాద్,
తదితరులు పాల్గొన్నారు.